Home > Featured > ఓర్చుకో కన్నా, హృదయవిదారకం.. తెలంగాణ నుంచి వెళ్తూ

ఓర్చుకో కన్నా, హృదయవిదారకం.. తెలంగాణ నుంచి వెళ్తూ

Man Clutches Baby In Scramble To Ge

లాక్‌డౌన్ పేదల బతుకులను ఎంతగా ఛిద్రం చేసిందో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలు. వలస కూలీలు కలోగంజో తాగడానికి సొంతూళ్లకు వెళ్తున్నారు. అన్నీ కల్పిస్తామని పేరు గొప్ప ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వాలు ఆచరణలో చేతులెత్తేయడంతో వలస కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. ఇళ్ల అద్దెలు కట్టలేని, తినడానికి తిండిలేక.. బతుక జీవుడా అని సొంతూళ్లక వెళ్తున్నారు.

తెలంగాణ నుంచి జార్ఖండ్ వెళ్లున్న వలస కూలీలు వీళ్లు, శ్రామిక్ రైళ్ల గురించి వీరికి తెలియదు. బతకడం కష్టమై బయల్దేరారు. కొంత దూరం నడిచారు. కొంత దూరం ఏ బండి కనిపిస్తే దాంట్లో ప్రయాణించి ఛత్తీస్‌గఢ్ చేరుకున్నారు. అక్కడి నుంచి జార్ఖండ్ వెళ్లడానికి ట్రక్కు ఎక్కారు. కిక్కిరిసిన ట్రక్కులోకి ఒక్కొక్కళ్లూ ఎక్కారు. చిన్నచిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఓ వ్యక్తి లారీ ఎక్కి నెలల బిడ్డను ఒక రెక్క పుచ్చుకుని పైకి అందించాడు. పిల్లలను నేలపై ఉన్నప్పుడు ఒంటిచేత్తో పైకి లేపం. అలాంటిది లారీపైకెక్కి అలా వెళ్లాల్సిన అగత్యమేర్పడింది. ‘మాకు ఇంకో దారి లేదు. ఇళ్లకు వెళ్లకపోతే రోడ్లపైనే చచ్చిపోతాం… ’ అని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూపరులు కంటతడి పెట్టిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకుని కూలీలకు తగిన రవాణ సదుపాయాలు కల్పించే ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు కొన్నైనా తగ్గుతాయి.

Updated : 12 May 2020 6:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top