నా చావుకు వాళ్లే కారణం.. సెల్ఫీ వీడియో.. - MicTv.in - Telugu News
mictv telugu

నా చావుకు వాళ్లే కారణం.. సెల్ఫీ వీడియో..

May 20, 2019

ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడి సెల్ఫీ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన భానుప్రకాశ్ అనే యువకుడు కొద్ది రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల కుటుంబ సభ్యులు భాను‌ప్రకాశ్ ఫోన్‌ను చెక్‌ చేయగా ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణం బయటపడింది.

ఆత్మహత్య చేసుకునేందుకు ముందు అతడు సెల్ఫీ వీడియోలో అప్పులవాళ్ల వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అఖిల్, అతని తండ్రి పది రూపాయల చొప్పున వడ్డీ కట్టాలని  నన్ను వేధించారు. నా బైక్, మా అమ్మ ఏటీఎం కార్డును కూడా లాక్కున్నారు. వాళ్ల వేధింపులు, అవమానాలే నా చావుకు కారణం’ అని ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.