నా పెళ్లాం కొడుతోంది సారూ.. పోలీస్ స్టేషన్‌లో మొగుడి ఆర్తనాదం  - MicTv.in - Telugu News
mictv telugu

నా పెళ్లాం కొడుతోంది సారూ.. పోలీస్ స్టేషన్‌లో మొగుడి ఆర్తనాదం 

January 14, 2020

bvb

భార్యపై భర్త దాడి.. తరహా వార్తలను తరచూ చూస్తుంటాం. చదివి చదవి విసిగెత్తిపోతుంటాం. దీనికి భిన్నమైన వార్తలు కనిపిస్తే ఆసక్తి కూడా కనబరుస్తుంటాం. అలాంటిదే ఈ వార్త కూడా. భార్య తనను చావగొడుతూ నరకం చూపుతోందని ఓ మగానుభావుడు పోలీసులను ఆశ్రయించాడు. 

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీకి చెందిన షాదుల్లా  సోమవారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. ‘నా పెళ్లాం కొడుతోంది. దెబ్బలకు తట్టుకోలేకపోతున్న. మీరే నన్ను కాపాడాలె.. ’ అని ఎస్సై గిరిని కోరాడు. చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకున్నాడు. ఎందుకు కొడుతోందని అడగ్గా.. ఇంటి విషయాల్లో అంటూ తాపీగా చెప్పాడు. భార్యాభర్తల మధ్య అలాంటివి మామూలేని, ఆమెకు సర్దిచెబుతానని గిరి అభయమిచ్చారు. భార్య కొడుతోందని భర్త తమ వద్దకు రావడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు.