వేములవాడ ఆలయంలో వెండి, బంగారు కానుకల చోరీ! - MicTv.in - Telugu News
mictv telugu

వేములవాడ ఆలయంలో వెండి, బంగారు కానుకల చోరీ!

November 22, 2019

Man confesses on gold and silver theft from Telangana temple, officials deny claim

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించే వెండి, బంగారు కానుకల చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలో గత నెల 23, ఈ నెల 6న హుండీ లెక్కించారు. కానుకలను లెక్కిస్తున్న క్రమంలో హుండీలోని వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఆభరణాలను ఫిరోజ్ దొంగిలించాడని గుర్తించారు. 

వేములవాడలోని శాస్త్రినగర్‌కి చెందిన ఫిరోజ్‌ నిత్యం రాజన్న గుడిలో భక్తులు ఆలయంలోని విగ్రహాలపై చల్లిన బియ్యం సేకరించి అమ్ముకుంటుంటాడు. క్యలైన్ వద్ద బియ్యం సేకరిస్తున్న క్రమంలో కొద్ది రోజుల క్రితం కార్పెట్ల కింద ఓ సంచిని చూశాడు. ఆ సంచిని దొంగిలించాడు. అందులోని అభరణాలను అమ్మేందుకు కరీంనగర్‌ వెళ్లాడు. ఆ నగలను చూసి  వ్యాపారులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగి గురువారం ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. అతని నుంచి పూర్తి వివరాలకోసం పోలీసులు విచారణ చేపట్టారు.