భారతీయుడు అని గుర్తిస్తేనే శవాన్ని తీసుకుంటాం.. - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయుడు అని గుర్తిస్తేనే శవాన్ని తీసుకుంటాం..

October 14, 2019

బతికి వున్నప్పుడు ఆ వ్యక్తిని దేశం విదేశీయున్ని చేసింది. అతను చనిపోయాడు. అయితే అతన్ని ఇప్పుడైనా భారతీయుడిగా ప్రకటిస్తేనే మృతదేహాన్ని అంగీకరిస్తామని అతడి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంచలనంగా మారిన ఈ ఘటన అసోంలోని సోనిత్పూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అసోంలోని సోనిత్పూర్‌ జిల్లా అలిసింగా గ్రామానికి చెందిన దులాల్‌ చంద్రపాల్‌(65)ను గతంలో ప్రభుత్వం విదేశీయుడిగా ప్రకటించింది. ఆ తర్వాత మానసిక స్థితి కోల్పోయిన ఆ వ్యక్తిని నిర్బంధ కేంద్రంలో ఉంచారు. 

Man Declared.

అయితే అతడు తీవ్ర అనారోగ్యంతో ఆదివారం గువహటి వైద్య కళాశాలలో మరణించాడు. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు. చంద్రపాల్‌ను భారతీయుడిగా ప్రకటిస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని లేకపోతే తీసుకోమని జిల్లా అధికారులను డిమాండ్ చేశారు. ఆయనను బంగ్లాదేశ్ వ్యక్తిగా ప్రకటించినందకు బంగ్లాదేశ్‌కే అప్పగించండి అని అన్నారు. అతడిని విదేశీయుడిగా ప్రకటించడంతోని ఆయన మతిస్థిమితం కోల్పోయాడని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మృతదేహాన్ని కుటుంబసభ్యులు అంగీకరించేలా ఒప్పించేందుకు ప్రతినిధుల్ని పంపించింది. కాగా, ఆగస్టు 31న ప్రకటించిన ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో దాదాపు 19లక్షల మందికి పైగా పేర్లు నమోదు కాకపోవడంతో వారిని దేశంలోకి చొరబడ్డ విదేశీయులుగా గుర్తించారు.