చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు.. మరణం అనేది ఏరకంగా మీదపడుతుందో ఎవరూ ఊహించలేరు. జీవితానికి గ్యారంటీ లేని రోజులివి. రెప్పపాటు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు ఈ మధ్య సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అంతవరకు బాగానే ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా మరణిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారి కుప్పకూలి చనిపోతే..ఊహించని ప్రమాదంతో మరికొందరు మృత్యుఒడిలోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఢిల్లీలోని ప్రయాగ్ రాజ్ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. అంతవరకు స్నేహితులతో సరదాగా గడిపిన యువకుడికి రెండు క్షణాల్లో నూరేళ్లు నిండిపోయాయి.
ఢిల్లీ నుంచి కాన్పూర్‌కు నిలనాచల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లో హరికేశ్ దుబే అనే వ్యక్తి శుక్రవారం ఉదయం ప్రయాణించాడు. జర్నీలో స్నేహితులకు సరదాగా గుడిపాడు. తర్వాత విండో సీటుకు మారాడు. ఆ ఒక్క క్షణంలో విధి వక్రించింది. వీండో సీటులో కూర్చున్న హరికేశ్ దుబే మెడలోకి బయటనుంచి వచ్చిన ఓ ఇనుప చువ్వ దూసుకొచ్చింది. పక్కవాళ్లు ఏం జరిగిందో తెలుసుకునే లోపే అతడి ప్రాణాలు పోయాయి. అసలు ట్రైన్ లోకి ఇనుప చువ్వ ఎక్కడి నుంచి దూసుకొచ్చింది అనేది అక్కడివారికి అర్థం కాలేదు. దన్వర్ సోమ్నా స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. కొన్నిచోట్ల ట్రాక్‌లు సరిచేసే క్రమంలో ఇనుప కడ్డీ బోగీలోకి దూసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.