ఫోన్ పరధ్యానం.. పట్టాలమీద పడ్డాడు(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ పరధ్యానం.. పట్టాలమీద పడ్డాడు(వీడియో)

November 30, 2019

ఇప్పుడు చాలామంది మొబైల్ పరధ్యానంలో ఉంటున్నారు. చుట్టుపక్కలవాళ్లను పట్టించుకోనంతగా ఫోన్లలో ముఖాలు పెట్టి దారి సాగుతున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఫాలో అవ్వాలన్న ధ్యాసతో ఒంటి మీద స్పృహలేకుండా తయారవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫోన్‌లో లీనమై రైలు పట్టాలమీద పడ్డ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఫోన్ ధ్యాసలో పడి అమాంతం వెళ్లి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే ఆ వ్యక్తిని తిరిగి ఫ్లాట్‌ఫామ్‌పైకి లాగేయడంతో పెను ప్రమాదమే తప్పింది. స్వల్ప గాయాలైన అతన్ని రైల్వే సిబ్బంది స్ట్రెచర్‌పై అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం ప్రాథమిక చికిత్స చేసి పంపించారు. ఈ సంఘటన బ్యూనస్ ఎయిర్స్‌లోని డి లైన్, అగ్యురో స్టాప్‌లో ఈ నెల 13వ తేదీన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఫోన్ ధ్యాసలో మునిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. ఆ సమయంలో రైలు వచ్చుంటే అతని పని ఏమయ్యేదని నెటిజన్లు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.