పెళ్లి అనేది నూరేళ్ల బంధం. ఒకసారి వివాహం జరిగాక ఎన్ని కష్ట, నష్టాలు వచ్చిన భరించి జీవితంలో ముందుకు సాగిల్సిందే. భార్య మెడలో తాళి బొట్టు కట్టాక కడ వరకు ప్రయాణించక తప్పదు. కానీ ఈ మధ్య భార్యభర్తల బంధానికి అర్థం మారిపోతుంది. పరిస్థితులు, అవసరానికి తగ్గట్టు మారిపోతున్నారు. తాజాగా ఇలాంటిన ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
ఓ వ్యక్తి వివాహం ఘనంగా జరిగింది. అతిథులంతా హాజరయ్యారు. ఇక వేద మంత్రాల సాక్షిగా వరుడు వధువు ఒక్కటయ్యారు. అంతా ఆనందంగా ఉన్నారు. సరిగ్గా గంట వ్యవధిలో సీన్ రివర్స్ అయ్యింది. పాత సినిమా క్లైమెక్స్ తరహాలో ఓ మహిళ ఎంటర్ అయ్యి ఈ పెళ్లి చెల్లదు అంటూ హల్చల్ చేసింది. పెళ్లి పెద్దలు, పెళ్లి కొడుకుతో గొడవకు దిగింది. పెళ్లికొచ్చిన వారిలో ఈ ఘటనతో అంతా షాక్ లోకి వెళ్లిపోయారు. మెల్లగా ఆమె పెళ్లి కొడుకు మొదటి భార్య అని తెలుకొని కాళ్లబేరానికి వచ్చారు. ఆమెకు నచ్చ జెప్పేందు ప్రయత్నించారు ఆమె వినకపోక.. పెళ్లికొడుకుని పోలీసులకు అప్పజెప్పింది. తనకు విడాకులివ్వకుండా వేరే వారిని పెళ్లి చేసుకున్నాడనే కారణంతో జైలుకి పంపించింది. దీంతో అందరూ తలలు పట్టుకున్నారు.
ఇక ఆతడు ఆమెకు విడాకులు ఇస్తే కేసు వెనక్కు తీసుకుంటానని చెప్పడంతో పెద్దలంతా ఓ నిర్ణయం తీసుకున్నారు. గంట ముందు వివాహం చేసుకున్న భార్యను తన తముడికి వివాహమిచ్చి పెళ్లి చేయాలని సూచించారు. అలా ఐతే కేసుల నుంచి తప్పించుకోవచ్చని సలహా ఇచ్చారు. దీనికి అంతా ఓకే చెప్పడం..దీంతో గంట క్రితం వివాహం చేసుకున్న అమ్మాయికి విడాకులిచ్చిన భర్త.. ఆమెను తన తమ్ముడికిచ్చి అక్కడే వివాహం జరిపించడం చకచకా జరిగిపోయాయి.
ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి నాలుగేళ్ల క్రితం మొదటి వివాహమైంది. అయితే, ఆ తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు తాజా ఎంట్రీ ఇచ్చి పెళ్లిని క్యాన్సిల్ చేయించడం చర్చనీయాంశంగా మారింది.