మనసున్న మారాజు… రూ. కోటి విలువైన భూమిని పేదలకు పంచిపెట్టి… - MicTv.in - Telugu News
mictv telugu

మనసున్న మారాజు… రూ. కోటి విలువైన భూమిని పేదలకు పంచిపెట్టి…

May 20, 2019

Man Donate His 2 acres land For poor people for build house.

మనిషి బతకాలంటే కావాల్సింది కూడు, గూడు, గుడ్డ. ఇవి దొరక్క ఇంకా మన దేశంలో అనేక మంది నానా ఇబ్బందులు పడుతూ బతుకుతున్నారు. పక్కనోళ్లు ఏమైపోతే మనకేంటి అనుకుంటున్న ప్రస్తుత సమాజంలో గూడులేక ఇబ్బందులు పడుతున్న పేదలను చూసి ఓ పెద్దాయన మనసు చలించిపోయింది. తన వంతు సాయంగా కొందరికైన సొంతం ఇళ్లు కట్టుకునేందుకు స్థలం ఇవ్వాలని భావించి, రూ. కోటి విలువ చేసే రెండు ఎకరాల కొబ్బరితోటను ఇళ్ల స్థలాలుగా మార్చారు. ఆదివారం గ్రామపెద్దల సమక్షంలో 54 మంది పేదలకు అందజేసి పెద్దమనసు చాటుకున్నాడు.

ఇంతకీ ఆయన ఎవరంటే ? కాకినాడ సమీపం కేంద్రపాలిత యానాం నియోజకవర్గంలోని దరియాలతిప్పకు చెందిన మాజీ కౌన్సిలర్ మెల్లం వెంకటసుబ్బారావు.. దరియాలతిప్ప కొత్త కాలనీ వద్ద ఉన్న తన సుబ్బారావు భూమిని పేదలకు పంచడంతో వారంత అతనికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఆ ప్రాంతానికి మెల్లం వెంకటసుబ్బారావు కాలనీగా నామకరణం చేశారు. ఇలా తన భూమిని పేదలకు పంచడంతో నెటిజన్లు సుబ్బారావును అభినందనలతో ముంచెత్తుతున్నారు.