Home > Featured > గద్ద ప్రాణాన్ని కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు

గద్ద ప్రాణాన్ని కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు

ఓ పక్షి రాజు ప్రాణాన్ని కాపాడబోయి.. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్న విషాద ఘటన దేశ ఆర్థికరాజధాని ముంబై నగరంలోని బాంద్రా-వర్లి సముద్రపు వంతెనపై చోటుచేసుకుంది. మే 30న జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా బయటపడింది. అమర్ మనీష్ జరీవాలా (43) అనే వ్యక్తి కారులో బాంద్రా-వర్లి సీ లింక్ పై వెళ్తుండగా.. ఓ గద్ద ఉన్నట్లుండి ఆ కారుకింద చిక్కుకుపోయినట్లు గమనించాడు. వెంటనే రు ఆపాలని డ్రైవర్ శ్యామ్ సుందర్ ను కోరాడు. ఇద్దరూ కారు దిగి.. కారుకింద చిక్కుకుపోయిన గద్దను ఎలా కాపాడాలా అని ఆలోచిస్తుండగానే.. వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఆ ఇద్దరినీ ఢీ కొట్టి వెళ్లిపోయింది. కారు వేగానికి ఇద్దరూ రోడ్డుకు చెరోవైపు ఎగిరిపడ్డారు. అమర్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన డ్రైవర్ శ్యామ్ సుందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదాన్ని ఓ సందర్శకుడు తన కెమెరాలో చిత్రీకరించగా.. ప్రమాదానికి కారణం ట్యాక్సీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనకు కారణమైన టాక్సీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 10 Jun 2022 1:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top