రూ. 85 లక్షల అరటిపండును దానయ్య తినేశాడు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 85 లక్షల అరటిపండును దానయ్య తినేశాడు (వీడియో)

December 8, 2019

Bridegroom

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు అరటిపండును గోడకు టేపుతో అతికించి అదొక పెద్ద కళాఖండం ప్రదర్శనకు పెట్టిన విషయం తెలిసింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఏర్పాటు చేసిన ఈ ఆర్ట్ గ్యాలారీని ప్రదర్శించిన దీన్ని ముగ్గురు వ్యక్తులు రూ. 85 లక్షలకు కొన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ప్రదర్శన చివరి రోజు ఆ కళాఖండాన్ని దారిన పోతూ వచ్చిన దానయ్య ఒకడు తినేసి కలకలకం రేపాడు. 

మౌరిజియా కాటెలాన్‌ అనే కళాకారుడు ఈ అరటిపండును గోడపై పెట్టి, టేపుకు చుట్టాడు. దానికి ‘కమెడియన్’ అని పేరు పెట్టాడు. నిన్న ఎగ్జిబిషన్ చివరి రోజు కావడంతో జనం పెద్దసంఖ్యలో వచ్చారు. డేవిడ్ డటూనా అనే డ్రామా ఆర్టిస్టు కూడా వచ్చాడు. వచ్చినోడు గమ్మున ఉండకుండా తాపీగా ఆ పండు వద్దకు వెళ్లి టేపు పీకి, పండు ఒలుచుకుని తేశాడు. అక్కడి సిబ్బంది తేరుకునేలోపే సగం పండు అతని కడుపులోకి వెళ్లిపోయింది. అతనిపై సిబ్బంది కోప్పడ్డారు. 

అయితే తాను ‘ఆకలిగొన్న కళాకారుడిని’ అని డేవిట్ వివరణ ఇచ్చాడు. 85 లక్షల విలువైన పండును తిన్నందుకు అతనికి శిక్ష పడే అవకాశముందని అంటున్నారు. అయితే వేలం వేసిన కళాఖండం పాడు కాలేదంటూ గ్యాలరీ సిబ్బంది మరో అరటిపండును తీసుకొచ్చి యథాస్థానంలో అతికించేశారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే.. ఈ అరటి కళాఖండాన్ని సృష్టించిన మారిజియో గతంలో తయారు చేసిన బంగారు కక్కసు దొడ్డిని దొంగలు ఎత్తుకోవడం.