man falls into Kodaikanal waterfall while posing for pics
mictv telugu

కొంప ముంచిన పోజు.. జలపాతంలో గల్లంతు..

August 4, 2022

వాటర్ ఫాల్స్ వద్ద ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు కాలు జారడంతో ఓ యువకుడు ఆ జలపాతంలో పడి గల్లంతయ్యాడు. తమిళనాడు దిండిగల్‌లోని పుల్లవేలి జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పుల్లవేలి జలపాతానికి పర్యటకులు తాకిడి ఎక్కువైంది. పరమకుడికి చెందిన అజయ్ పాండ్యన్(26)అనే యువకుడు తన స్నేహితులతో కలిసి జలపాతాన్ని చూడడానికి వచ్చాడు. జలపాతం అంచున నిలబడి ఫొటోకు ఫోజూ ఇస్తున్న అజయ్.. ప్రమాదవశాత్తు కాలు జారి వందల అడుగుల లోతులో పడిపోయాడు.

స్నేహితులు కేకలు వేయడం వల్ల అప్రమత్తమైన యాత్రికులు.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. సుమారు ఐదు గంటల పాటు గాలింపు చేపట్టినా.. అజయ్ ఆచూకీ లభించలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతకుముందు స్నేహితుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.