Man Filed For Divorce Because His Wife Served Him Only Maggi Noodles For All Meals
mictv telugu

మూడు పూటలా మ్యాగీనే… విడాకులిచ్చిన భర్త

May 30, 2022

Man Filed For Divorce Because His Wife Served Him Only Maggi Noodles For All Meals

మ్యాగీ ఓ కొత్తజంట కాపురంలో చిచ్చుపెట్టింది. ఏకంగా ఆ నూతన వధూవరులు విడాకులు తీసుకునే వరకు వెళ్లేలా చేసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తన భార్య మూడు పూటలా మ్యాగీనే పెట్టడంతో విసిగిపోయిన ఓ భర్త విడాకుల కోసం కోర్టుకెక్కాడు. మ్యాగీ తప్ప ఇంకేమి వండడం రాని భార్యతో తెగతెంపులు చేసుకున్నాడు. ఈ కేసును విచారించిన జడ్జ్ రఘునాథ్ మ్యాగీ కేసుగా అభివర్ణించారు.

మైసూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఉన్న ఎంఎల్ రఘునాథ్ శుక్రవారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్న చిన్న విషయాలకే విడాకుల కోసం దాఖలవుతున్న మ్యాట్రిమోనియల్ కేసులు గురించి ప్రస్తావించారు. బాధితుడి భార్య అతనికి అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కోసం మూడు పూటల మ్యాగీనే వడ్డించేదని కంప్లైట్‌ చేశాడు. అలాంటి మహిళతో తనకు విడాకులు ఇప్పించాలని కోరినట్టుగా జడ్జీ రఘునాథ్‌ వివరించారు. ఆ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టుగా చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలపై విడాకుల పిటిషన్లు రావడం కోర్టులకు కొత్తేమీ కాదని రఘునాథ్ అన్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్నవారే కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు విడాకులు కోరుకుంటున్నారని చెప్పారు. క్రమంగా విడాకులు కేసులు పెరుగుతున్నాయన్నారు.