సెకండ్ హ్యాండ్ కొన్నాడు.. అందులో రూ. 30 లక్షలు చూసి.. - MicTv.in - Telugu News
mictv telugu

సెకండ్ హ్యాండ్ కొన్నాడు.. అందులో రూ. 30 లక్షలు చూసి..

January 21, 2020

Sofa.

రోడ్డుమీద పది రూపాయల నోటు దొరికితేనే నిమిషం ఆలస్యం తీసుకునే రోజులు ఇవి. అలా ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే తిరిగి ఆచూకీ కనుక్కొని ఇచ్చే వారి సంఖ్య చాలా తక్కువే. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా రూ. 30 లక్షల రూపాయలను తిరిగి ఇచ్చేశాడు. తాను కొన్న సోఫాలో దొరికిన వీటిని జాగ్రత్తగా దాని యజమానికి చేర్చాడు. మిచిగాన్‌ ఇది జరిగింది.  ఆ వ్యక్తి నిజాయితీ గురించి తెలిసిన వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

హోవార్డ్ కిర్బీ అనే వ్యక్తి ఓ సెకండ్ హ్యాండ్ సోఫాను కొనుక్కున్నాడు. కొన్ని రోజులకు దాని నుంచి 43 వేల డాలర్లు (30 లక్షల 60 వేల) నోట్ల కట్టలు బయట పడ్డాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బు సోఫాలో ప్రత్యక్షమవడం చూసి ఆశ్చర్యపోయాడు. తాను సోఫా కొనుగోలు చేసిన వ్యక్తికి సంబంధించినదేనని భావించి ఆ షాపు వద్దకు వెళ్లి దాని యజమాని వివరాలు తీసుకున్నాడు. వెంటనే అక్కడికి వెళ్లగా కిమ్ పాత్ అనే మహిళ ఉండటంతో ఆమెకు జరిగిన విషయం చెప్పాడు. 

అయితే అది తమ తాత వాడిన సోఫా అని అనారోగ్యంతో ఇటీవలే ఆయన చనిపోయాడని తెలిపింది. అంతుకు ముందు దాన్నికాల్చేద్దామని అనుకున్నట్టు చెప్పింది. కానీ సోఫా దుకాణం వాళ్లు దాన్ని తీసుకుంటామని చెప్పడంతో  విక్రయించినట్టు తెలిపింది. దీంతో ఆ పెద్దాయన సోఫాలో డబ్బులు దాచుకొని ఉంటాడని భావించి వాటిని కిమ్ ఫాత్‌కు ఇచ్చేశాడు. అతడి నిజాయితీ చూసిన ఆమె ప్రశంసలు కురిపించింది. పరుల సొమ్ము పాము లాంటిది అని భావించిన ఆ వ్యక్తి తిరిగి దాన్ని అసలు వారసులకు అందేలా చేయడం విశేషం.