ఓ తీట పోరడు పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు. ఓ పోలీసును మూతిమీద కొట్టాడు. పోలీసులు ఊరుకోరు కదా. పట్టుకోబోయారు. మనోడు మహా చురుకు కాబట్టి కాలికి బుద్ధి చెప్పాడు. కానీ ఎంతసేపని పరిగెత్తగలడు? దారిలో ఓ వంతెన ఎక్కాడు. పోలీసులు వదల్లేదు. వంతెన కింద చుట్టుముట్టారు. సరెండర్ కావడమో, లేకపోతే బ్రిడ్డిపై నుంచి దూకి అవతలవైపున్న భవనాలపై నుంచి పారిపోవడమో.. రెండే ఆప్షన్స్ ఉన్నాయి. దూకొద్దురా బాబూ, చచ్చిపోతావు అతని పోలీసులు, జనం మొత్తుకుంటున్నారు. అయినా వాడు పట్టించుకోలేదు. దూకి పారిపోడానికే సిద్ధమయ్యాడు. దూకేశాడు కూడా. తర్వాత ఊహించినట్టే జరిగింది…
దొంగా, పోలీస్ ఆటను తలపించే ఈ తతంగం అమెరికాలోని బ్రూక్లిన్ నగరంలో జరిగింది. కెండాల్ ఫ్లాయిడ్ అనే యువకుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపాడు. పోలీసులు పట్టుకున్నారు. మనోడికి అసలే కోపం. కారు బయటికి వచ్చి ఓ పోలీసును మూతిపై పిడిగుద్దు గుద్దాడు. పోలీసులు పట్టుకునేలోపే ఓసబ్వే ట్రాక్ ఎక్కాడు. పోలీసులు వెంటపడ్డారు. కెండాల్ తప్పంచుకోడానికి వీధి అవతలిపైపు ఉన్న బిల్డింగ్ పైకి దూకాడు. సరిగ్గనే పడ్డాడుగాని కాళ్లు దెబ్బిన్నాయి. పరిగెత్తలేక చతికిలబడ్డాడు. పోలీసులు చకచకా వెళ్లి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడని, త్వరలో కోర్టుకు మర్యాదగా అప్పజెబుతామని పోలీసులు చెప్పారు.
#Subway #Jumper @MTA suspect fleeing #NYPD. pic.twitter.com/a5xsiqyIWr
— Isaac Abraham (@IsaacAb13111035) July 7, 2022