మంచంతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు..బైరవ దీపం సినిమా కాదు - MicTv.in - Telugu News
mictv telugu

మంచంతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు..బైరవ దీపం సినిమా కాదు

September 25, 2020

bedd

బైరవ దీపం సినిమాలో హీరోయిన్‌ను మాయల పకీరు మంచంతో సహా గాల్లోకి తీసుకెళ్లి పోతుంటాడు. అప్పట్లో ఇది అందరిని ఆకట్టుకుంది. కానీ రీల్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఇలాంటివి చేయగలమని నిరూపించాడు ఓ వ్యక్తి ఏకంగా తన బెడ్‌తో పాటు గాల్లోకి ఎగిరిపోయి, హాయిగా నిద్రపోయాడు. టర్కీకి చెందిన హాసన్ కావల్ అనే వ్యక్తి ఈ సహసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. 

హాసన్ కావల్ గాల్లో మంచంతో పాటు ఎగిరిపోవాలని అనుకున్నాడు. వెంటనే ఓ ఐడియా వచ్చింది. పారాగ్లైడర్‌కు తేలికైన మంచం లాంటిది తగిలించాడు. బెడ్ రూం సెటప్ ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు. అంతే హాయిగా ఆకాశంలో ఎగురుతూ నిద్రపోయాడు. సముద్రం పైన కొంతసేపు పారాగ్లైడర్‌తో చక్కర్లు కొట్టి ఆ తర్వాత జాగ్రత్తగా ల్యాండ్ అయ్యాడు. కాగా, హాసన్ కావల్ ఇలాంటి సాహసాలు చేయడం కొత్తేమి కాదు. గతంలో ఇలాగే కాఫీ తాగుతూ, సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కూడా గాల్లో చెక్కర్లు కొట్టాడు. ఈసారి కొత్తగా బైరవం దీపం సినిమా తరహా మంచంతో పాటు లేచిపోవడం పలువురిని ఆకట్టుకుంది.