man forcibly kissing womens in bihar
mictv telugu

 ఆడోళ్లకు దడపుట్టిస్తున్న సీరియల్ కిస్సర్

March 14, 2023

man forcibly kissing womens in bihar

అమ్మాయిలు, ఆంటీలు..రోడ్డుమీద ఒక్కరే ఉన్నారా..? అయితే పారాహుషార్..సీరియల్ కిస్సర్ వస్తున్నాడు జాగ్రత్త. అవును మీరు విన్నది నిజమే సీరియల్ కిల్లర్ కాదు..సీరియల్ కిస్సర్. వరుసగా హత్యలు చేసి పరారయ్యే వాడిని కిల్లర్ అంటాము. అదే విధంగా ఓ యువకుడు అమ్మాయి , ఆంటీ అన్న తేడా లేకుండా ఆడవాళ్లైతే చాలు అన్నట్లుగా ముద్దు మీద ముద్దు పెడుతూ దడపుట్టిస్తున్నాడు. టైం అంటూ ఏదీ పిక్స్ కాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో తెలియదు..

అమ్మాయిలే వాడి అసలు టార్గెట్..ఒంటరిగా దొరికితే చాలు పండుగ చేసుకుంటున్నాడు. వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని ముద్దు పెడతాడు. ఎవడో వాడు అని తెలుసుకునేలోపే అక్కడి నుంచి పరారవుతాడు. ప్రస్తుతం ఓ యువకుడు సీరియల్ కిస్సర్‏గా బీహార్‏లో కలకలం సృష్టిస్తున్నాడు. పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీరియల్ కిస్సర్ ముద్దు సీన్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

బీహార్‏లోని జమై సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ మహిళ మధ్యాహ్నం సమయంలో ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీదకు వచ్చింది. ఏదో విషయం గురించి సీరియస్‏గా సంభాషిస్తున్న మహిళ ఫోన్‏లో మునిగిపోయింది. ఇంతలో ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ముందుకు వెళ్లి గట్టిగా పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు.

మహిళ పట్లు అసభ్యకరంగా వ్యవహరించాడు. అసలు ఎవరు ఇలా చేశారు అని తెలుసుకునే లోపే ఆ కుర్రాడు అక్కడి నుంచి జంప్ అయ్యాడు. ఇలాంటి సంఘటనలు బీహార్ చోటు చేసుకుంటుండటంతో మహిళలు ఒంటరిగా బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఎప్పడు, ఎక్కడి నుంచి ఎలా ఉపద్రవంలా ఊడిపడతాడోనని కంటి మీద కునుకులేకుండా మహిళలు భయపడుతున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించి ఈ సంఘటనపై ఫిర్యాదు చేశారు మహిళలు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.