man from Bangalore posted on Twitter that his wife was committing domestic violence against him
mictv telugu

‘చావగొడుతుంది.. నన్నెవరైనా కాపాడండి’

October 31, 2022

భార్య పెట్టే వేధింపులు భరించలేని ఓ భర్త.. చివరకు ఏం చేయాలో తెలియక సోషల్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకున్నాడు. కాపాడండి మహప్రభో అంటూ మొరపెట్టుకున్నాడు. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న యదునందన్ ఆచార్య అనే వ్యక్తి.. లింగ వివక్షపై ఎప్పట్నుంచో పోరాటం కొనసాగిస్తున్నాడు. తాజాగా ట్విటర్ వేదికగా.. రక్తమోడుతున్న అరచెయ్యి ఫోటోను షేర్ చేశాడు.

‘‘నాకు ఎవరైనా సహాయం చేస్తారా? లేదు.. ఎందుకంటే నేను మగాడ్ని కాబట్టి. నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. నారీ శక్తి అంటే ఇదేనా? ఈ ఘటన ఆధారంగా నేను నా భార్యపై గృహ హింస కేసు పెట్టగలనా? లేదు.. ఎందుకంటే మగాడ్ని కదా!’’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కి మెన్‌టూ అనే హ్యాష్‌ట్యాష్ పెట్టి.. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, బెంగళూరు పోలీస్ కమిషనర్‌ని ట్యాగ్ చేశాడు. తనపై భార్య గృహ హింసకు పాల్పడుతోందని మొరపెట్టుకున్న అతగాడు.. తన ఫిర్యాదుని స్వీకరించాలని కోరాడు. అయితే దీనికి భౌతికంగా ఫిర్యాదు చేయాలని నగర పోలీసు కమిషనరేట్‌ సూచించారు.