బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి తన హోటల్‌కో ఓ విచిత్రమైన పేరు పెట్టాడు. కస్టమర్స్‌ని ఆకర్షించడానికే ఈ పేరు పెట్టాడేమో కానీ తాను మాత్రం ఇలా ప్రత్యేక పేరు పెట్టడానికి ఓ కారణం ఉందని చెబుతున్నాడు. బిహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి.. కొత్తగా పెట్టిన తన హోటల్‌కు ‘మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్’ అని పేరు పెట్టారు. అంతే కాదు, పేరుకు తగ్గట్టు.. రెండో వివాహం చేసుకున్నవారు ఈ హోటల్‌కు వస్తే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు. పట్నాకు 70 కిలోమీటర్ల దూరంలోని బాడ్ పట్టణంలో ఉన్న ఈ హోటల్లో టీ, బర్గర్లు, నూడుల్స్ తోపాటు.. వేసవి కాలంలో ఐస్‌క్రీమ్‌లు కూడా అమ్ముతారు. రోడ్డుపై వెళ్తున్నవారు ఈ విచిత్రమైన పేరు చూసే హోటల్‌కు వస్తున్నారట.
ప్రస్తుతం రెస్టారెంట్‌కు ‘మై సెకండ్ వైఫ్’ అని పేరు పెట్టడానికి ఓ కారణం ఉందని చెబుతున్నాడు రంజిత్. సాధారణంగా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని, అందుకే ఈ హోటల్ తన రెండో భార్య వంటిదని అంటున్నాడు. ‘ఇంటి వద్ద నాకు భార్య ఉంది. ఇక్కడ మాత్రం రెస్టారెంట్ నా భార్య వంటిది. ఇవి రెండంటే నాకు ఇష్టం’ అని చెబుతున్నాడు. హోటల్‌కు ఇలాంటి పేరు పెట్టడంపై మొదట తన భార్య ఒప్పుకోలేదని, తన కుటుంబ సభ్యులు సైతం అభ్యంతరం తెలిపారని రంజిత్ చెప్పాడు. మొత్తానికి వారిని ఒప్పించి ఈ పేరు పెట్టానని సంతోషంతో చెబుతున్నాడు.
అదృష్టమో, దురదృష్టమో.. రెండోసారి పెళ్లి చేసుకున్నవారికి తన హోటల్లో డిస్కౌంట్ ఇస్తానంటున్నాడు రంజిత్. రెండో పెళ్లి చేసుకున్న మహిళలైనా, పురుషులైనా.. ఈ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపాడు. ‘సాధారణంగా కస్టమర్లలో ఎవరికి రెండో వివాహం జరిగిందో తెలుసుకోవడం కష్టమే. కానీ, ఎవరైనా రెండు వివాహాలు చేసుకున్నట్లు తెలిస్తే మాత్రం కచ్చితంగా డిస్కౌంట్ ఇస్తా’ అని రంజిత్ తెలిపాడు.