man from Rajahmundry who used instagram and cheated over 60 girls under arrest
mictv telugu

వీడు మామూలోడు కాదు.. 60మందితో పులిహోర కలిపి రూ.4కోట్లు వసూలు

July 15, 2022

ఈ జనరేషన్‌లో చాలామంది అమ్మాయిలకి పెద్దగా లోకజ్ఞానం తెలిసినట్లు లేదు. లేకపోతే సోషల్ మీడియాలో పరిచయమైన ఓ అనామకుడికి రూ.కోట్ల వరకూ సమర్పించుకోవడం ఏంటీ.. పిచ్చి కాకపోతే. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను అంత త్వరగా నమ్మకూడదని పోలీసు వారితో సహ ఎంతో మంది అవగాహాన కల్పించినా ఇంకా మోసపోతూనే ఉన్నారు ఈ అమ్మాయిలు. వేధింపులు, బ్లాక్ మెయిళ్లకు లోనవుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ అడ్డాగా ఓ కేటుగాడు.. ఏకంగా 60 మంది అమ్మాయిలకు వల వేశాడు.

రాజ‌మండ్రికి చెందిన జోగ‌డ వంశీకృష్ణ అనే వ్యక్తి బీటెక్ పూర్తి చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. త‌న‌కు తాను హై ప్రొఫైల్ వ్య‌క్తిగా అమ్మాయిల‌ను న‌మ్మించాడు. అనంత‌రం అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ.. చాలా మంది యువ‌తులు త‌న ఫ్రెండ్‌షిఫ్ కోసం త‌పిస్తున్న‌ట్లు బిల్డ‌ప్ ఇచ్చేవాడు. అలా 60 మంది అమ్మాయిల‌ను మోసం చేసి.. రూ. 4 కోట్ల వ‌ర‌కు దోచుకున్నాడు. అమెరికాలో ఉండే హైద‌రాబాద్‌కు చెందిన ఓ యువ‌తి కూడా వంశీకృష్ణ చేతిలో మోస‌పోయింది. దీంతో ఆమె హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టి.. అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. వంశీకృష్ణపై గతంలో రాచకొండ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, వైజాగ్, కరీంనగర్, విజయవాడలో ఈ త‌ర‌హా కేసులు న‌మోదైన‌ట్లు పోలీసులు తెలిపారు.