మధ్యప్రదేశ్‌లోని బేతుల్ రైల్వే స్టేషన్ పట్టాలపై అక్టోబర్ 3న పోలీసులు ఓ తల లేని మొండెం దొరికింది. తల లేకపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. తాజాగా దాని తాలూకూ తల బెంగళూరు రైల్వే స్టేషన్లో లభ్యం అయింది. ఆ మొండెం తాలూకూ తల 1300 కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరు చేరుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్‌కి చిక్కుకుని ఆ తల బెంగళూరుకు వెళ్ళింది. అక్టోబర్ 4న రైలు ఇంజన్‌కు చిక్కుకుని ఉన్న తలను బెంగళూరు రైల్వే స్టేషన్ సిబ్బంది గుర్తించారు.
రైల్వే పోలీసులు ఆ తలను ఫొటో తీసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో బేతుల్ రైల్వే స్టేషన్లో ఓ తల లేని మొండెం ఒకటి దొరికినట్లు బెంగళూరు పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేయగా సదరు విడి భాగాలు బతుల్‌కు చెందిన రవి మర్కామ్(28)కు చెందినవిగా గుర్తించారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.