సిక్స్ ప్యాక్ కోసం చాలామంది యువత జిమ్‌లకు వెళ్లి చెమటోడ్చుతారు. మరికొందరు జిమ్‌లో వర్కవుట్లు చేయలేక మధ్యలోనే వదిలేస్తారు. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం.. సిక్స్ ప్యాక్ కోసం పడరాని పాట్లు పడలేదు.. అలా అని మధ్యలోనే వదిలెయ్యలేదు. ఆ కష్టం తన వల్ల కాదని తెలసుకొని కేవలం రెండే రోజుల్లో సిక్స్ ప్యాక్ ను సాధించాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో పెట్టడంతో అది విపరీతంగా వైరల్ అయింది.
దక్షిణాఫ్రికాలోని మాంచెస్టర్‌కు చెందిన డీన్ గుంథర్(34) ఊబకాయంతో బాధపడుతున్నాడు. సినిమా హీరోల మాదిరిగా సిక్స్ ప్యాక్ సాధించాలనే కోరికతో.. జిమ్‌కు వెళ్లి ట్రైనర్ సూచించినట్లు కొంత కాలం వర్కవుట్లు చేశాడు. ఆ కష్టం తాను పడలేనని వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా ఓ టాటూ ఆర్టిస్ట్ డీన్‌ను సంప్రదించాడు. తనకు కడుపుపై టాటూ వేయాలని, అది అచ్చం సిక్స్ ప్యాక్‌లా ఉండాలని చెప్పాడు.మనిషి కడుపుపై అబ్స్ మాదిరిగా ఉండేలా టాటూ వేశాడు. దీనికోసం ఆయన ఎలాంటి డబ్బులు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఓ ప్యాషన్ ప్రాజెక్ట్‌లా చేపట్టాడంట. దీంతో ఈ వ్యక్తి కేవలం రెండు రోజుల్లోనే ఇలాంటి టాటూతో దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను టాటూ ఆర్టిస్ట్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు ఇంత ఈజీగా సిక్స్ ప్యాక్ పొందొచ్చా అంటూ కామెంట్లు చేస్తున్నారు.