అతడు అడ్డుకోకుంటే 400 మందినీ చంపేవాడే! - MicTv.in - Telugu News
mictv telugu

అతడు అడ్డుకోకుంటే 400 మందినీ చంపేవాడే!

March 15, 2019

ఆటోమేటిక్ రైఫిళ్లతో టపటపా కాల్చేస్తున్నాడు. పెద్దలని, పిల్లలని విచక్షణ లేకుండా నరమేధానికి తెగబడుతున్నాడు. వాడి బారి నుంచి తప్పించుకోవడం ఎలా అన్న ఆలోచన తప్ప మరో ఆలోచనలేదీ లేని జనం ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నారు. తలుపు  వద్దకు వెళ్తున్నారు. వాడు మాత్రం పట్టువదలని రాక్షసుడిలా కాల్చిపారేస్తున్నాడు.. కానీ ఓ వ్యక్తి ధైర్యం చేశాడు. ప్రాణాలకు తెగించి ఆ దుర్మార్గుడిని వెనుక గట్టిగా పట్టుకున్నాడు. ఆ ముష్కరుడు గింజుకుంటున్నా వదలకుండా ఒడిసి పట్టుకున్నాడు. దీంతో వాడు తుపాకీని కిందపడేశాడు.

Man Grabbed New Zealand Shooter Brenton Tarrant.

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ పట్టణం అల్ నూర్ మసీదులో జరిగిన సంఘటన ఇది. ఆ ఆపద్బాంధవుడు.. దుర్మార్గుడిని అడ్డుకోకుండా ఉండనట్లయితే మసీదులోని దాదాపు 400 మందీ అతని కాల్పుల్లో చనిపోయి ఉండేవారని భారత సంతతికి చెందిన ప్రత్యక్ష సాక్షి పైజల్ సయీద్ చెప్పారు. శ్వేతజాత్యహంకారంతో జరిపిన ఈ ఉగ్రదాడిలో 49 మంది చనిపోగా, 30 మందికిపైగా గాయపడ్డం తెలిసిందే.

మారణకాండకు కారణాలను వివరిస్తూ షూటర్ బ్రెంటాన్ 73 పేజీల లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యూరోపియన్ దేశాల్లోకి ముస్లిం వసలు పెరిగాయని, న్యూజిలాండ్‌లోని మ‌సీదుల‌పై దాడి చేస్తే విషయం ప్రపంచానకి తెలుస్తుంద‌ని పేర్కొన్నాడు. ‘శ్వేత‌జాతి పిల్లల భ‌విష్య‌త్తు కోసం, ల‌క్ష‌లాది యురోపియ‌న్ల కోసం నేను ఈ దాడికి దిగుతున్నాను.. యూరప్ నేల‌ను ఆక్రమించి వేలాది మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైనవారిపై ప్ర‌తీకారంతోనే ఈ పని చేస్తున్నాను..’ నఅని చెప్పుకొచ్చాడు.  స్టాక్‌హోమ్‌లో రెండేళ్ల కిందట ఉగ్ర‌వాది కాల్పుల్లో చనిపోయిన 11 ఏళ్ల చిన్నారి ఎబ్బా మృతికి ప్ర‌తీకారంగా దాడి చేస్తున్నానన్నారు. ‘మ‌సీదుల‌పై దాడి చేస్తున్నందుకు నేనేమాత్రం ప‌శ్చాతాప పడ్డం లేదు. మ‌రింత మంది కబ్జదారులను, దేశ‌ద్రోహుల‌ను చంపితే బాగుండు. నేను ఒకవేళ ప్రాణాల‌తో పోలీసుల‌కు దొరికినా నా నేరాన్ని ఒప్పుకుంటాను’ అని పేర్కొన్నాడు.