ఈ ముసలోడికి 36 మంది పిల్లలు..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ ముసలోడికి 36 మంది పిల్లలు..!

June 13, 2017


ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటే ఆ సందడి వేరు. అయినా వారి అల్లరి భరించడం కష్టం.కానీ ఆ ఇంట్లో ఏకంగా 36 మంది పిల్లలు. ఆ ముసలోడు వేసిన విత్తు వేసినట్టే మొలిచింది. డజన్ , రెండు డజన్లు, మూడు డజన్లకు చేరింది. మరో విత్తు మొలకెత్తడానికి సిద్ధంగా ఉందట. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ క్లిష్ట పరిస్థితిలో ఉందనుకున్నాడేమో…ఏకంగా తన ఇంట్లోనే మూడు టీమ్ లు తయారు చేశాడు. 36 మంది పిల్లలతో మేకల మందలా ఆ ఇల్లుని మార్చేశాడు. ఏజ్ జస్ట్ 57 నాటౌట్ అంటూ సింగిల్స్ మీద సింగిల్స్ తీస్తూనే ఉన్నాడు.ఇంతకీ ఎవరా ముసలోడు..ఏమా కథా…

పిల్లల మధ్యలో ఉన్న ఇతని పేరు గుల్జార్ ఖాన్.వయస్సు 57 ఏళ్లు..ప్రస్తుతం అతను పాక్ వాయువ్య గిరిజన ప్రాంతంలోని బన్ను నగరంలో ఉంటున్నాడు. 15 మంది తోబుట్టువుల్లో ఒకడైన గుల్జార్ ఖాన్ కు ముగ్గురు భార్యలు.36 మంది పిల్లలు. ఇప్పుడు ఆయన మూడో భార్య గర్భవతి. త్వరలో మరో వికెట్ కూడా పడబోతోంది. రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్న ఇంకా లైఫ్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. చెమటోడ్చి సింగిల్స్ మీద సింగిల్స్ తీస్తూనే ఉన్నాడు. ఇదేమని గుల్జార్ ఖాన్ అడిగితే దిమ్మదిరిగే ఆన్సార్ ఇస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు … మేమెందుకు వద్దంటాం అని అంటున్నాడు. ‘ఈ మొత్తం విశ్వాన్ని, మానవాళిని సృష్టించింది దేవుడు. ఆయన వరప్రసాదమైన పిల్లలకు జన్మనివ్వకుండా ఎందుకు ఆపాలి?’ అంటూ ప్రశ్నిస్తున్నాడు.
గుల్జార్ ఖానే కాదు ఈయన సోదరుల్లో ఒకడైన మస్తాన్ ఖాన్ వజీర్ (70) ప్రస్తుతం 22 మంది పిల్లలకు తండ్రి. గుల్జార్‌కు మాదిరిగా ముగ్గురు మహిళలకు భర్త అయిన వజీర్… మనవలు, మనువరాండ్ర సంఖ్య అయితే లెక్కించడమే కష్టమట. ఇక బలూచిస్తాన్‌లోని క్వెట్టా నగరంలో జాన్ మొహమ్మద్ ఇప్పటివరకూ నలుగురు భార్యల ద్వారా 38 మంది పిల్లలకు జన్మనిచ్చాడు.

పాకిస్తాన్‌లో ఈ ముగ్గురు ‘మొనగాళ్లు’దాదాపు 100 మంది పిల్లలకు తండ్రులు. అయినా సంతాన కాంక్ష ఏమాత్రం తగ్గని వారు.. ఒకరు కాదు వంద మంది ముద్దు అంటూ సెంచరీల దిశగా చెలరేగుతున్నారు. ఈ సహజ ప్రక్రియను ఆపడానికి మనం ఎవరం? ఇస్లాంలో కుటుంబ నియంత్రణ లేదని వాదిస్తున్నారు. ఒక్కొక్కరు 100 మంది పిల్లలను కనడమే తన జీవిత లక్ష్యమంటున్నారు పాకిస్తాన్‌లో 19 ఏళ్ల తర్వాత జరుపుతున్న జనగణనలో ఈ విషయం వెల్లడవడంతో అధికారులు విస్తుపోతున్నారు. ఒక్కో వ్యక్తికి ఇద్దరు ముగ్గురు భార్యలు.. పదుల సంఖ్యలో పిల్లలను చూసి వారు అవాక్కవుతున్నారు. కేవలం మూడు కుటుంబాల్లో కలిపి దాదాపు 100 మంది పిల్లలు ఉన్నారంటే బాపూరే..డబుల్ జంబో ప్యాక్ కాదు సెంచరీ ప్యాక్..

https://m.facebook.com/story.php?story_fbid=10155650199743690&id=7382473689