వీడి బాక్స్ బద్దలు కావాల్సిందే...! - MicTv.in - Telugu News
mictv telugu

వీడి బాక్స్ బద్దలు కావాల్సిందే…!

August 16, 2017

సూస్తె ఏం దెల్వని ఎడ్డి పోరనిలెక్కనే  ఉన్నడు గనీ వీనంత బద్మాష్ గాడు ఎవ్వడు లేడు.ఎవరైనా ఆకతాయిలు ఆడవాళ్లను వేధిస్తే  షీ టీమ్స్ కు  కంప్లైంట్ చెయ్యమంటారు కదా,కానీ ఈ తీస్మార్కాన్ గాడు ఏకంగా ఓ షీటీమ్ మహిళా కానిస్టేబుల్ కే ఫోన్జేశి  శెప్పరాని బూతులు తిట్టుకుంటా కొన్ని రోజులుగా వేదిస్తున్నాడట. అంతేకాదు వాని గురించి  పెద్ద పోలీసోళ్లకు జెప్పిందని ఆమె నంబర్ ను పోర్న్ సైట్ల వెట్టిండట..వానికెంత బలుపో సూడున్రి.

వీని పేరు నిఖిల్ కుమార్ వరంగల్‌ రూరల్‌ జిల్లా, పరకాల మండలం, సాగరవిడి గ్రామమట,హైద్రాబాద్ ఇబ్రహీం పట్నంల ప్రైవేట్ ఉద్యోగం చేస్తడట.కొన్ని రోజులకింద్ర  ఓ కాలేజీ అమ్మాయి మొబైల్ ఫోన్కు  అడ్డమైన మెసేజ్ లు పంపించుకుంట సతాయించిండట..ఆమె ఈ విషయంమీద రాచకొండ పోలీసులకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేశిందట,బద్మాష్ గాని శెమ్డలు దీయనీకి విచారణ  స్టార్ట్ జేశిన్రట.విచారణల భాగంగా షీ టీమ్ లేడీ కానిస్టేబుల్  ఫోన్జేస్తే  మల్లా అదే కథ…బుద్దేడికోతది,ఆమెతోని గుడ  అన్ని లత్కోర్ మాటలు మాట్లాడుకుంట…ఆమె ఫోన్కు అడ్డమైన్ మెసేజ్ లు పంపిండట.ఇంకేముంది మహిళా కానిస్టేబుల్ కూడా వీనిమీద కేసువెట్టింది,ఆహా నామీదనే కేసు వెడ్తవా అని ఆమె నంబర్ను ఒక పోర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు.కొన్నాళ్లుగా ఆమెకు అజ్ఞాత వ్యక్తుల నుంచి వందల కొద్ది ఫోన్లు వచ్చాయి. వారంతా అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో మనస్తాపానికి గురైన కానిస్టేబుల్‌.. పోలీసులకు విషయం చెప్పింది. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న షీటీమ్స్‌, పోలీసులు బీరం నిఖిల్‌ కుమార్‌ను వరంగల్‌లో మంగళవారం అరెస్ట్‌ చేశా రు. ఆకతాయిలు వేధిస్తే మహిళలు నిర్భయంగా వాట్సప్‌ నంబరు 9490617111కు సందేశం రూపంలో ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సూచించారు.