Man held for hoisting Pakistan flag in Utar Pradesh's Kushinagar
mictv telugu

యూపీలో పాకిస్తాన్ జెండా ఎగరేసిన యువకుడు అరెస్ట్

August 13, 2022

Man held for hoisting Pakistan flag in Utar Pradesh's Kushinagar

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా అజాదీ అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా అని 75వ స్వాతంత్ర్య దినోత్సావాలు జరుపుకుంటుంటే.. యూపీలో మాత్రం ఓ యువకుడు తన ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురవేశాడు. యోగి సర్కార్ నేతృత్వంలోని బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలో పాకిస్థాన్ జెండా ఎగరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్రంలో ఖుషీనగర్ ప్రాంతంలోని వేదుపార్ ముస్తాక్విల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సల్మాన్ (21) అనే ముస్లిం యువకుడు తన ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగురవేశాడు.

ఆ వ్యక్తి ఇంటి మీద పాకిస్థాన్ జెండా ఎగురుతుండడం గమనించిన స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సల్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ పాకిస్థాన్ జెండాను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడితో పాటు జెండాను రూపొందించిన అతడి బంధువు షెహనాజ్, పతాకావిష్కరణలో సాయపడిన ఇమ్రాన్ అనే మైనర్ బాలుడిపైనా కేసు నమోదు చేశారు. దీనిపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ రితేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో పాక్ జెండాను ఎగురవేశారని, సల్మాన్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిపారు.