లేడీస్ టాయిలెట్‌లో దూరి.. గర్ల్‌ఫ్రెండ్ కోసం చోరీ - MicTv.in - Telugu News
mictv telugu

లేడీస్ టాయిలెట్‌లో దూరి.. గర్ల్‌ఫ్రెండ్ కోసం చోరీ

July 31, 2022

తన గర్ల్‌ఫ్రెండ్‌కి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఓ యువకుడు ఏకంగా సెల్‌ఫోన్‌ దుకాణానికి కన్నంవేశాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఘటన కారణంగా ప్రస్తుతం అతడు కటకటాలు లెక్కిస్తున్నాడు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన అబ్దుల్‌ మునాఫ్‌ ఈనెల 20న రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో క్రోమ్‌ అనే షోరూంకు వెళ్లాడు. షోరూం మూసే సమయంలో మహిళల టాయ్‌లెట్‌లోకి వెళ్లిపోయాడు. అక్కడే దాక్కున్న అతడు… షోరూం మూసిన తర్వాత ఖరీదైన 6సెల్‌ఫోన్లను తస్కరించాడు. ఆ తర్వాత గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి తప్పించుకున్నాడు.

ఆ తర్వాతి రోజు షోరూంకు వచ్చిన స్టాఫ్ సెల్‌ఫోన్లు చోరీ అయిన విషయాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి 5 లక్షల విలువ చేసే ఖరీదైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటరాగేషన్‌లో లవర్ కోసం సెల్‌ఫోన్లు చోరీ చేసినట్లు చెప్పాడు. అతడి సమాధానం విని పోలీసులు అవాక్కయ్యారు.