Home > Featured > కుక్కల లొల్లిలో దూరాడు.. తర్వాత ఏమైందో చూడండి..! 

కుక్కల లొల్లిలో దూరాడు.. తర్వాత ఏమైందో చూడండి..! 

సోషల్ మీడియాలో ఎన్నో వింత వింత వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. కొన్ని ఫన్నీగా,మరికొన్ని జుగుప్సాకరంగా వుంటాయి. ఏది ఏమైనప్పటికీ సమాచారానికి ఎంతటి విస్తృతి పెరిగిందో అతికీ అంతే స్థాయి పెరిగింది. తాజాగా సోషల్ మీడియాలో క్లబ్ చేసిన రెండు వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. వాటిని పోల్చి చూస్తే ఒక దాంట్లో ప్రతిభ కనిపిస్తే మరో వీడియోలో ‘చెడపకురా చెడేవు’ అన్న సూక్తి వీళ్ల విషయంలో నిజమైందేమో అనిపిస్తుంది. ఫిట్‌ భారత్‌ అనే ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేసిన వీడియోలో ఓ వ్యక్తి ప్రతిభను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నీ ఒంట్లో ఎముకలు కాదు అన్నీ స్ప్రింగులే వున్నట్టున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. వెనక్కి జంపులు చాలా వేగంగా చేస్తున్నాడు ఆ వ్యక్తి.

మరో వీడియోలో రెండు కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. వాటి అరుపులకు చిరాకుపడ్డాడు అక్కడే వున్న ఓ వ్యక్తి. వాటిని కొట్టబోయాడు. అంతే ట్రాక్టర్‌ రోటివేటర్‌లో చిక్కుకుని పల్టీలు కొట్టాడు. చూస్తుంటే నవ్వు తెప్పించినప్పటికీ నెటిజన్లు ఇందులో మంచి సందేశం వుందంటున్నారు. ఈ రెండు వీడియోలను పోలుస్తూ నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ వీడియలో వ్యక్తి స్వయం ప్రతిభను కనబరిస్తే. మరో వీడియోలో యాంత్రిక ప్రతిభ కనబడిందని కామెంట్‌ చేస్తున్నారు. కర్మఫలం అంటే ఇదేనేమో అని కొందరు సెటైర్లు విసురుతున్నారు. ఈ ఘటనలు పాకిస్తాన్‌లో చోటు చేసుకున్నాయి.

Updated : 13 Sep 2019 9:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top