మధ్యప్రదేశ్‌లో బాంబు పేలుడులు కలకలం సృష్టించాయి. జబల్పూర్లో ప్రభుత్వ యూనివర్సిటీపై బాంబు దాడి జరిగింది. ముసుగు ధరించి వచ్చిన దుండగుడు రెంబు బాంబులను క్యాంపస్ లోపలికి విసిరాడు. దీంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసింది. అక్కడున్న వాళ్ళు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారి నుంచి తప్పించుకుని బైకుపై పారిపోయాడు. క్యాంటీన్ బయట ఈ దాడి జరిగింది. బాంబు పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు ఇదే ప్రాంతంలో రెండు పేలని బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . బాంబుదాడిలో ఎవరూ గాయపడలేదని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రమేష్ గౌరవ్ తెలిపారు. నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు.
#WATCH | Madhya Pradesh: An unidentified man was seen hurling two bombs outside the canteen of Rani Durgavati Vishwavidyalaya in Jabalpur on 15th February. No injuries or casualties were reported.
(Source: CCTV visuals) pic.twitter.com/tF2wpokew8
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 16, 2023