చైనాలో పుట్టిన మరో కొత్త వైరస్..ఒకరి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

చైనాలో పుట్టిన మరో కొత్త వైరస్..ఒకరి మృతి

March 24, 2020

Man in China passed away after testing positive for hantavirus.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోన్న సంగతి తెల్సిందే. కరోనా వైరస్‌ను కట్టడి చేయలేక ప్రభుత్వాలు తల పట్టుకుంటున్నాయి. దేశాలకు దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే.. చైనాలో మరో కొత్త వైరస్ పుట్టిందని వార్తలు వస్తున్నాయి. తాజాగా హంటా వైరస్ లక్షణాలతో చైనాలో ఒకరు మరణించారని తెలుస్తోంది. మరో 32 మందిలో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయట. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది.

చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఈ వైరస్ పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. యూనాన్ ప్రావిన్స్‌కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలు కనిపించాయి. 33మంది ప్రయాణికుల బస్సులో ప్రయాణించిన ఆ వ్యక్తి హంటా వైరస్ లక్షణాలతో కొన్ని గంటల్లోనే మరణించాడు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం బస్సులో ప్రయాణించిన వారందరికి పరీక్షలు చేసింది. కొందరికీ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.