హైదరాబాద్ ప్రగతిభవన్ ఎదుట ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. చంచల్ గూడకు చెందిన నజీరుద్దీన్ ఒంటిపై పెట్రోల్ పోసుకుంటున్న సమయంలో వెంటనే ప్రగతి భవన్ సిబ్బంది అడ్డుకున్నారు. అతని ఒంటిపై నీళ్లు గుమ్మరించారు. అనంతరం నజీరుద్దీన్ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులతో సమీక్ష జరుపుతున్నారు. ఈ సమయంలో అక్కడ ఆత్మహత్నాయత్నం ఘటన జరగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Publiée par Satyavathi Satya sur Dimanche 17 mai 2020
నజీరుద్దీన్ గత రెండు సంవత్సరాలుగా చెప్పుల షాపు నడుపుతున్నాడు. రెండు నెలలుగా పని లేకపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని, అప్పులు బాధలు ఎక్కువయ్యాయని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. లాక్డౌన్ కారణంగా వ్యాపారం మరింత నష్టపోయిందని.. ఆదాయం లేక తీవ్ర ఆర్థక ఇబ్బందుల్లో ఉన్నానని, ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయాడు. అప్పులు తీర్చే దారిలేకే ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు అతను తెలిపాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.
Publiée par Satyavathi Satya sur Dimanche 17 mai 2020