నవ్వ పెడితే చేత్తో గీరుకుంటాం. దురద పెడితే కూడా అంతే. దురద ఎక్కువైతే ఏం చేస్తాం? ముఖ్యంగా వీపుపై దురద పెడితే? పూర్వం విసనకర్రతో గోక్కునేవారు. ఇప్పడవి లేవు కనుక పుల్లలు, కర్రలు, గరిటలు.. చేతికి ఏవి దొరికితే అవి అందుకుని ఏవో తిప్పలు పడుతుంటాం. అయితే ఓ మహానుభావుడు మాత్రం ఏకంగా జేసీబీతో వీపు గోకించుకున్నాడు. ఇప్పటికే జేసీబీలను కరోనా మృతుల తరలించడానికి వాడుకుంటున్న నేపథ్యంలో ఇలాగా కూడా వాడుకోవచ్చా అని జనం నోరెళ్లబెడుతున్నారు.
కేరళలో ఈ దారుణం జరిగింది. కూలి పని చేసుకునే ఓ పెద్దాయనకు దురద పెట్టింది. గోక్కుంటే చేతులు నొప్పి పుడతాయని ఏకంగా అక్కడే ఉన్న జేసీబీ ముందుకెళ్లి నిల్చున్నాడు. దాని డ్రైవర్ నెమ్మదిగా లోడర్ను ఆ పెద్దాయన వీపుపై ఉంచి గోకాడు. కొన్ని క్షణాలు గోకాక సరదా పైకి లైపు గోకు వీరుడి పొట్టముందుకు లోడర్ను తీసుకెళ్లి ఆటపట్టించాడు. దీంతో ఆ ముసలాయన ‘ఓరి నాయనోయ్.. ’ అని పక్కకు పరిగెత్తాడు. అబ్దుల్ నాసిర్ అనే వ్యక్తి ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అందరూ వారెవ్వా, ఏం ఐడియా గురూ అంటున్నారు.
പൊറം ചൊറിഞ്ഞാൽ പിന്നെ എന്താ ചെയ്യാ
പൊറം ചൊറിഞ്ഞാൽ പിന്നെ എന്താ ചെയ്യാ
Publiée par ABDUL NASAR sur Dimanche 11 octobre 2020