చమ్మక్ చల్లో అంటే జైలుకే - MicTv.in - Telugu News
mictv telugu

చమ్మక్ చల్లో అంటే జైలుకే

September 5, 2017

కొన్ని సార్లు కొన్ని మాటలు అస్సలు బూతలా అన్పించవు. కొన్ని మాటలు బూతా కాదా అని తేల్చడదానికి కోర్టుల దాకా వెళ్లాల్సి ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ మాట అనలగరు…. లేని ఇబ్బందులు తెచ్చుకోగలరని ఈ వార్త ఇస్తున్నాం. చమ్మక్ చల్లో అనే మాట పొరపాటున… అదీ ఆడవాళ్లను  ఉద్దేశించి అంటే గనుక మీరు జైలుకు వెళ్లడం ఖాయం. అరే ఈ మాటలో ఇంత ప్రమాదం ఉందా అని అనుకోకండి… పైగా మాట  షార్ ఖాన్ నటించిన రావాన్ సిన్మాలోనిది. ఆ సిన్మాలో  హిట్ సాంగ్ చమ్మక్ చల్లో…..

అదే పాటలోని ఈ మాటను ఓ వ్యక్తి థానే లో మహిళను ఉద్దేశించి అన్నాడట. తనను అవమానించడని ఆమె పోలీసు స్టేషన్లో కేసు పెట్టాలని అనుకున్నది. కేసు పెట్టేందుకు వారు ఒప్పుకోలేదట. నేరుగా కోర్టును ఆశ్రయించింది. 8ఏళ్ల తర్వాత కోర్టు ఆమె బాధను అర్థం చేసుకున్నది. చమ్మక్ చల్లో అనే మాట బూతే అని కోర్టు చెప్పింది. సదరు వ్యక్తికి సాధారణ జైలు శిక్ష ఒక్క రూపాయి ఫైన్ వేసింది కోర్టు. ఇంతకు చమ్మక్ చల్లో అంటే  హాట్ బ్యూటీ అని  అర్థం అట.