అతడు చచ్చిపోయి మేడిచెట్టును కన్నాడు.. షాకింగ్ స్టోరీ - MicTv.in - Telugu News
mictv telugu

అతడు చచ్చిపోయి మేడిచెట్టును కన్నాడు.. షాకింగ్ స్టోరీ

September 26, 2018

మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పిచూడ పురుగులుండు.. పద్యం అందరికీ తెలిసిందే కదా. మనం చెప్పుకోబోయేది మేడిపండు సంగతి కాదు, మనిషి కడుపులోంచి పుట్టిన మేడి చెట్టు సంగతి! ఒక మరణంలోంచి పురుడు పోసుకున్న ప్రకృతి హేల గురించి..  అత్యంత నాటకీయంగా సాగిన ఈ డిటెక్టివ్ స్టోరీకి వెళ్దాం పదండి..

rr

44 ఏళ్ల కిందట హత్య

1974లో గ్రీస్, టర్కీల మధ్య గొడవలు జరిగాయి. గ్రీక్ సైప్రోయిట్స్‌, టర్కిష్‌ సైప్రోయిట్స్‌ దళాల మధ్య సాగిన యుద్ధంలో అహ్మద్‌ హెర్గూన్‌ అనే టర్కీ జవాను హతమయ్యాడు. శత్రువులు అతనితోపాటు మరో ఇద్దరిని మూరుమూల కొండల్లోని గుహలోకి తీసుకెళ్లి లోపల బాంబులు పెట్టి పేల్చేశారు. పేలుళ్లలో గుహ పైకప్పుకు రంధ్రం పడింది. మృతుల ఆచూకీ తర్వాత ఎవరికీ తెయకుండా పోయింది. కాలం గడిచింది. తర్వాత ఆ గుహలో మేడి మొక్క మొలిచింది. మొక్క చెట్టైంది. బాంబు పేలుడుతో ఏర్పడిన రంధ్రం నుంచి సూర్యకాంతి సోకడంతో దానికి కలిసొచ్చింది.

2011లో ..

ఆ ప్రాంతంలో మేడి చెట్లు లేవు. కానీ గుహపై ఒకే ఒక్క మేడి చెట్టు కనిపించడం ఒక వృక్ష పరిశోధకుణ్ని ఆశ్చర్యానికి గురిచేసింది. చెట్టు మొదళ్లను వెతుక్కుంటూ గుహలోపలికి వెళ్లాడు. మొదల్లో తవ్వగా మానవ కంకాళాలు బయటపడ్డాయి. యుద్ధంలో చనిపోయిన వారివి అని తేలడంతో అహ్మద్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తర్వాత శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. యుద్ధంలో చనిపోవడానికి ముందు అహ్మద్ మేడిపళ్లు తిన్నాడని, అతని కడుపులోంచి గింజ మొలకెత్తిందని తేల్చారు. అహ్మద్ మృతదేహ డీఎన్ఏ అతని కుటుంబ సభ్యుల డీఎన్ఏతో సరిపోలింది. అహ్మద్ ఆచూకీ కోసం సుదీర్ఘంగా వేచిచూశామని, చివరికి మేడిచెట్టు తమకు సాయం చేసిందని అతని సోదరి 87 ఏళ్ల మునూర్ భావోద్వేగంతో చెప్పింది.

rr