man killed his younger brother by running him over with a car in Prakasam District,
mictv telugu

కారుతో తొక్కించి తమ్ముడిని చంపిన అన్న

September 8, 2022

ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. తమ్ముడికి ఆసరాగా ఉండాల్సిన అన్న కాలయముడయ్యాడు. సోదరుడుని కారుతో తొక్కించి దారుణంగా హత మార్చాడు. ఈ ఘటన త్రిపురాంతకం మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లి గ్రామానికి చెందిన కంచర్ల వెంకటేశ్వర్లు, ఏడుకొండలు(30) అన్నదమ్ములు. గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఏడుకొండలు జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళుతుండగా అతడి అన్న కంచర్ల వెంకటేశ్వర్లు తన కారుతో వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. దీంతో ఏడుకొండలు తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకట సైదులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.