కొడుకు పుట్టలేదని ఆలిని సంపిండు...! ముగ్గురి పిల్లల్ని అనాథల్ని చేసిండు..! - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకు పుట్టలేదని ఆలిని సంపిండు…! ముగ్గురి పిల్లల్ని అనాథల్ని చేసిండు..!

August 3, 2017

ఆడపిల్లలు పొయ్యేటప్పుడు ఆస్తులు తీస్కుపోతారనే ఓ దురాలోచనను ఖండించిన తన భార్యను అతి కిరాతంగా సంపిండు.కొడుకును కనుంటే ఆ అభాగ్యురాలు బతికుండేదేమో.ఇప్పుడు ముగ్గురు ఆడ పిల్లలు తల్లిలేక రోడ్డున పడ్డాడు.తండ్రేమో జైల్లో ఉన్నాడు.ఇదంతా జరిగింది వికారాబాద్ జిల్లాలో…

ఆడపిల్ల పుడితే భార్యను వదిలేసే వాడు ఒకడు..ఆడపిల్ల అని తెలిస్తే పుట్టకముందే చిదిమేసేవాడు ఒకడు.మొగ పిల్లవాడు పుట్టేదాకా కనుకుంటూ పోయేవాడు ఒకడు.ఆడపిల్ల పుట్టింది కాబట్టి అవ్వగారింటి నుంచి అదనపు కట్నం తీస్కరాపో అని భార్యను వేధించేవాడు ఒకడు..ఒరేయ్ ఎదవా ఆ ఆడపిల్లే లేకపోతే నువ్వెకడినుంచి పుట్టివాడివిరా.. మొగులు మీదికెల్లి ఊశిపడేవాడివా ..అని నాల్గు తగిలిస్తే నన్నా ఇలాంటి వాళ్లకు బుద్ది వస్తుందా ఏమో మరి? ఆడపిల్ల పుడితే ..సాక్షాత్తు ఆ మహాలక్ష్మే  ఇంటికి వచ్చింది అని సంతోషపడే వారు కొందరైతే ,అమ్మో ఆడపిల్లా పెంచి పెద్దచేసి కట్నాలు ఇచ్చి పెళ్లి చెయ్యాలి,అదే మగ పిల్లాడైతే అచ్చేదే గానీ పొయ్యేది ఏముండదు అని  ఆలోచించే వారు చాలామందే ఉన్నారు. ఎందుకు ఆడపిల్లలపై ఈ వివక్ష?ఏ.. పుట్టిన కొడుకులలో ఎంతమంది కన్నవాళ్లను జాగ్రత్తగా చూసుకుంటున్నారు? కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలే కొడుకులు  ఎందరు లేరు. అయినా కొందరు తండ్రులు ఎందుకు మారడంలేదు? ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాకెటుల్లా దూసుకుపోతున్న ఈకాలంలో కూడా అక్కడక్కడా ఆడపిల్లలంటే ఇంకా చిన్న ఎందుకు?. వికారాబాద్ జిల్లా లో జరిగన సంఘటన వింటే నిజంగా వాడు మనిషా లేక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా..ఇంకేమన్ననా  మీరే అర్ధం చేస్కోండి.

ఇది జరిగి దాదాపు పదిరోజులు అయింది ..సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్  డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గారి వల్ల ఈ సంఘటన బైటికచ్చింది.

అది వికారాబాద్ డిస్టిక్ మోమిన్ పేట్  అనే ఊరు…ఆ గొప్పతండ్రి పేరు బజారి అనంతయ్య..పేరు తగ్గట్టుగానే బజారులో మంచి పేరే ఉంది మాజీ టిడిపి ఎంపిటీసీ అని.కానీ ఆయన మెదడులో మొగపిల్లాడు కావాలనే అనే పురుగు కూడా ఉంది.ఆయన భార్య పేరు పద్మమ్మ..ముగ్గురు ఆడపిల్లలను నవమాసాలు మోసీ ప్రాణం పోసింది. పిల్లలు ప్రియాంక,ప్రవల్లిక,ప్రత్యూష. ప్రవల్లిక కొత్తగడి సోషల్ వెల్ ఫేర్ గర్స్ స్కూల్ 10 తరగతి చదువుతుంది,ప్రవల్లిక గౌలిదొడ్డి సోషల్ వెల్ ఫేర్ లో 8వ తరగతి  చదువుతుంది.చిన్న పాప ప్రత్యూష మోమిన్ పేట్  ఊర్లో 4 క్లాస్ చదువుతుంది. పేరుకు తండ్రి పెద్ద మాజీ  ఎంపిటీసి అయినా పిల్లలు సోషల్ వెల్ ఫేర్ స్కూల్లలో చదవాల్సిన పరిస్థితి.ఎందుకంటే ఆడపిల్లలు కదా…ఆతండ్రికి ఇష్టంలేదు.ముగ్గురు ఆడపిల్లలనే కన్నవ్ అని రోజూ భార్య పద్మమ్మకు వేదింపులు..ఒరేయ్ దరిద్రుడా దేవుడిచ్చిన దానికి నేనేం జేస్తా అని ఎన్నిమాట్ల సంజాంచినా మారని అతని బుద్ది. భర్తపెట్టే చిత్ర హింసలు తట్టుకోలేక ఇగ భర్తమారగడని  పుట్టింటికి వెళ్లింది.పిల్లలు పెర్గి పెద్దైతున్నరు…భర్తకు తాగుడు తందనాలాడుడు వంటి గొప్ప గుణాలున్నయని తెలిసి… పిల్లకోసమని మళ్లీ తిరిగచ్చింది పద్మమ్మ.ఉన్న ఆస్తులు  తాగుతూ,అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ..తాగచ్చిరోజూ భార్యాపిల్లల్ను కొట్టడం,ఒక సాడిస్టు భర్తగా,కనికరంలేని తండ్రిగా ఎంత చెయ్యాల్నో అంత చేశాడు అనంతయ్య.పిల్లలపై ఆస్తి రాయమన్నందుకు..భార్యపై కక్ష కట్టిన అనంతయ్య.

జూలై 25 నాడు పూర్తిగా రాక్షసుడిగా మారిన అనంతయ్య….!

బజారి అనంతయ్యలోని రాక్షసుడు భయపడ్డరోజు …రోజూలాగే పద్మమ్మ పొలంలోకి పనికి వెళ్లింది.వెనకాలే చేతిలో గొడ్డలి పట్టుకొని అనంతయ్య కూడా వెళ్లాడు..ముగ్గురు ఆడపిల్లల్నే కంటవా అని గొడ్డలితో దాడి చెయ్యబోయాడు,భర్త అమానుషాన్ని పసిగట్టిన పద్మమ్మ పరుగులు తీసింది…అయినా ఆ రాక్షసుడు ఊరుకోలేదు వెంబడించి  కట్టుకున్న భార్యను వీపులో ఒక్కవేటు వేసాడు.భర్త రాక్షసత్వానికి పద్మమ్మ కుప్పకూలిపోయింది.అయినా ఆ రాక్షసుడికి కసి తీరలేదు గొడ్డలితో భార్య శరీరంపై………చ రాయడానికే మాకు ఏదోలా వుంది.మీరో అర్ధం చేస్కోండి.ఏది ఏమైతేనే  మొగపిల్లాడు పుట్టలేదని  కట్టుకున్న భార్యను తెగ నరికి ఆ ముగ్గురు పిల్లల్ను అనాథల్ను చేసాడు అనంతయ్య.

 తండ్రిపై పిల్లలు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని పోలీసులు….!అండగా నిలిచిన సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రవీణ్ కుమార్

తల్లి చనిపోకముందు…మాతండ్రితో  మాకు.. మా అమ్మ ప్రాణాలకు ముప్పు ఉంది ,మాతండ్రి మమ్మల్ని ఏం చేస్తాడో  అని భయంగా ఉందని పద్మమ్మ పెద్దకూతురు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టిచ్చుకోలేదట.తల్లి చనిపోయాక ఆ విషయం గుర్తు చేస్తే అసలు మాకు కంప్లైంటే ఇవ్వలేదని ఇప్పుడు బుకాయిస్తున్నరట.సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ ప్రవీన్ కుమార్ ఆ ముగ్గురి పిల్లలకు అండగా నిలిచాడు. వాళ్లను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో బాగా చదివించి ప్రయోజకులని చేస్తామని హామీ ఇచ్చారు.అంతేకాదు తండ్రి పేరు మీదున్న కొంత భూమి పిల్లల పేర్లమీద దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేపిస్తానని మాటిచ్చారు.

ఇలా బజారి అనంతయ్య…భార్యను చంపి కటకటాల పాలయ్యాడు.ఇది వికారాబాద్ జిల్లాలో ఒక మనషి రాక్షసునిగా మారి కట్టుకున్న భార్యనే చంపిన సంఘటన.కనీ రాంగ రాంగ మనుషులం ఎట్ల తయారైతున్రో సూడున్రి. ఆస్తికోసమనీ,పిల్లలు పుట్టలేదని…సొంత మనుషుల్ని కూడా ఏం చెయ్యడానికైనా వెనకాడడం లేదంటే… ఇలాంటి వారు మనుషులుకాదు..రాక్షసులు.