సూపర్ మార్కెట్‌లో మిస్టరీ మ్యాన్.. భయం భయం..  - MicTv.in - Telugu News
mictv telugu

సూపర్ మార్కెట్‌లో మిస్టరీ మ్యాన్.. భయం భయం.. 

January 22, 2020

Man living in grocery store ceiling keeps eluding police .

ఆ సూపర్ మార్కెట్లో ఎవరో ఉన్నారు. కనిపించకుండా తిరుగుతున్నారు. ఎప్పుడేం ముంచుకొస్తుందోనని సిబ్బంది బితుకుబితుకుమంటూ పనిచేస్తున్నారు. అతని కాలు చూశామని ఒకరు, అడుగుల శబ్దాలు విన్నామని అంటున్నారు.  సూపర్ మార్కెట్‌లోని పైకప్పులోనే అతను దాక్కున్నాడని మరికొందరు చెప్పారు. విషయం పోలీసులకు చేరింది. వారు రంగంలోకి దిగారు. కానీ అతన్ని పట్టుకోవడం వారికి చాలెంజింగ్‌గా మారింది. వాషింగ్టన్‌లోని ఆబర్న్ నగరంలో హ్యాగెన్ సూపర్‌మార్కెట్‌లో గత కాలంగా హారరో, థ్రిల్లరో తెలియనిఈ  డ్రామా నడుస్తోంది. 

గత కొన్ని వారాలుగా సూపర్ మార్కెట్‌లో పనిచేసే ఉద్యోగులకు పైకప్పు నుంచి మనిషి అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒకరు ఏకంగా కాళ్లనే చూశానంటూ యాజమాన్యానికి చెప్పాడు. దీంతో ఆ సూపర్ మార్కెట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పైకప్పు మొత్తం వెతికినా.. ఆ అపరిచితుడి జాడ దొరకలేదు. అలా ఇప్పటివరకు దాదాపు నాలుగైదుసార్లు పోలీసులు పైకప్పును సోదా చేశారు. అయినప్పటికీ ఎటువంటి ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు, సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ఇదో సవాల్‌గా మారింది.  

డిసెంబర్ 25న అపరిచితుడు మార్కెట్‌ లోపల తిరుగుతున్న పుటేజ్‌‌ను పోలీసులు గుర్తించారు. మార్కెట్ మూసివేయగానే అపరిచితుడు పైకప్పు నుంచి కిందకు దిగి వేల రూపాయల విలువ చేసే మందు బాటిళ్లు, సిగరెట్లను దొంగతనం చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే అపరిచితుడు ఎక్కడ దాక్కున్నాడన్నది మాత్రం చిక్కు వీడని ప్రశ్నలా మారింది? అతను పైకప్పులోనే ఉంటున్నాడా? లేదా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడా? అన్నది ఎటూ తేల్చని పరిస్థితి ఏర్పడింది?? చివరికి అపరిచితుడిని పట్టుకోడానికి పోలీసులు ఇన్ప్రారెడ్ టెక్నాలజీని సైతం రంగంలోకి దించారు. నాలుగున్నర గంటల పాటు అన్వేషించినా.. వారికి అపరిచితుడి ఆచూకీ మాత్రం దొరకకపోవడం ప్రశ్నార్థకంగా మారింది??