చెల్లెలి ప్రియుణ్ని ఆమెతోనే పిలిపించి.. గొంతులో బాకు దించి..
చెల్లెలి ప్రేమ వ్యవహారం గిట్టని అన్న సినీ ఫక్కీలో ఆమె ప్రియుడిని హత్య చేశారు. ఆమెతోనే ఫోన్ చేసి పిలిపించి కడతేర్చాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో ఈ దారుణం జరిగింది. చీరాలకు చెందిన నల్లగొండ్ల దినేశ్ (21) గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు. అమ్మాయి కుటుంబానికి ఇది నచ్చలేదు. ఆమె కూడా వెనక్కి తగ్గలేదు. దినేశ్‌ను చంపేస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించారు.
అమ్మాయి అన్న విజయ్.. ఇద్దరు స్నేహితుల సాయం తీసుకున్నాడు. దినేశ్‌తో మాట్లాడతామని, అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పాలని చెల్లికి చెప్పాడు. ఆమె అమయాకంగా నమ్మేసి ప్రియుడికి ఫోన్ చేసింది. శుక్రవారం సాయంత్రం విజయ్ బ్యాచ్ చీరాల వెళ్లింది. దినేశ్ 216 ప్రేయసి చెప్పినట్లు జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. అతన్ని చూడగానే విజయ్, అతని స్నేహితులు దాడి చేశారు. గొంతులో బాకుతో పొడిచి పారిపోయాడు. దినేశ్ రక్తస్రావంతోనే పరిగెత్తి ఓ చెట్టుకింద కుర్చీలో కూర్చుని ప్రాణం విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.