యాచకురాలితో యువకుడి ప్రేమవివాహం.. - MicTv.in - Telugu News
mictv telugu

యాచకురాలితో యువకుడి ప్రేమవివాహం..

May 24, 2020

cvn vbhn

ప్రేమకు కులం, మతం, పేదధనిక అనే తేడాలుండవని ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో ఓ జంట నిరూపించింది. లాక్‌డౌన్ కారణంగా ఆహారం కోసం ఇబ్బందులు పడుతోన్న యాచకులను ఆదుకోవడానికి వెళ్లిన యువకుడు వారిలో ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడడంతో పెద్దలు పెళ్లి జరిపించేశారు.

అనిల్ అనే యువకుడు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఆహారం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అతడు సాయం చేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఓ బ్రిడ్జి కింద నివసిస్తోన్న యాచకులకు ఫుడ్ ప్యాకెట్లు అందించాడు. వారిలో నీలం అనే అనాథ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అనిల్ ను ఇష్టపడింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. కానీ, అనిల్ తల్లిదండ్రులు ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. అయినా కూడా అనిల్ వెనక్కి తగ్గకుండా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.