Man massaging AAP minister Satyendar Jain in Tihar Jail is not a therapist but a rape accused
mictv telugu

మంత్రికి మసాజ్ చేసిన ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే షాక్..

November 22, 2022

ఈ ఏడాది మే 30 న మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైలులో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు.. వీఐపీ ట్రీట్‌మెంట్‌ అందుతోందన్న వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం.. జైల్లో ఆయన మసాజ్‌ చేయించుకుంటున్న వీడియోలు వైరల్ కాగా.. ఆయన ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారని సొంత పార్టీ ఆప్ సమర్ధించుకుంది. అదంతా ఒట్టి అబద్ధమని, అందులో వాస్తవం లేదని తిహార్ జైలు అధికారులు చెప్పారు.

మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్ట్ కాదని, రేపిస్ట్‌ అని నిర్ధారించారు. పోక్సో చట్టం సహా ఐపీసీ 376, 506, 509 సెక్షన్ల ప్రకారం అభియోగాలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి రింకుగా గుర్తించినట్లు తెలిపారు. తిహార్ జైలు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. రింకూ అత్యాచార కేసులో జైల్లో ఉన్నాడు. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అతడి కన్న కూతురే ఆరోపణలు చేసింది. దానికింద గత ఏడాది అతడు అరెస్టయ్యాడు. ఆ వ్యక్తితోనే సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకుంటున్నారని వెల్లడించారు.

 

‘జైన్‌కు మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్టు కాదు. ఒక రేపిస్టు. దీనిని కూడా ఆప్ సమర్థించుకుంటుందా..? వారు తిహార్‌ను థాయ్‌లాండ్‌గా మార్చుకున్నారు’ అంటూ బీజేపీ తీవ్రంగా విమర్శలు చేసింది. ఆప్‌ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండిస్తోంది. అది మసాజ్‌ కాదు..ఫిజియోథెరపీ అంటూ తన వాదనను వినిపిస్తోంది.