ప్రేమికుల రోజున వివాహితను నరికి చంపాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమికుల రోజున వివాహితను నరికి చంపాడు..

February 15, 2018

ఒకపక్క నిన్న ప్రపంచమంతా ప్రేమికుల రోజును జరపుకుంది. మరోపక్క చెప్పరాని ఘోరాలు జరిగాయి. ప్రేమజంటలపై మతోన్మాద మూకల దాడులు చేశాయి. ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో ఒక ఉన్మాది రాక్షసుడయ్యాడు. తనను ప్రేమించలేదంటూ.. ఒక మహిళను పట్టపగలు అందరిముందూ గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. తర్వాత ఆ గొడ్డలితోనే వెళ్లి  పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.  నిందితుడు సచిన్ శర్మ కొంతకాలంగా ఒక యువతిని వేధిస్తున్నాడు. ప్రేమించాలని వెంటపడ్డాడు. అయితే ఆమె నో చెప్పేసింది. తల్లిదండ్రులు చూసిన వరుణ్ని కొన్నినెలల కిందట పెళ్లి చేసుకుంది. అయితే శర్మ ఆమెను తర్వాత కూడా వేధించడం మొదలుపెట్టాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నాలుగు రోజుల కిందట బెయిల్‌పై బయటికొచ్చాడు. సోమవారం ఆమె ఫోన్‌కు బెదిరింపు మెసేజ్ పంపాడు. తుపాకీ ఫొటోను కూడా జత చేశాడు. ఆమె పట్టించుకోలేదు. దీంతో శర్మ బుధవారం మార్కెట్ నుంచి తిరిగివస్తున్న ఆమెను వెంబడించి చంపేశాడు. అతణ్ని అడ్డుకోవడానికి ఎవరూ సాహసించలేకపోయారు.