దారుణం.. పంక్చర్ షాపులో కంప్రెషర్ పేలి వ్యక్తి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

దారుణం.. పంక్చర్ షాపులో కంప్రెషర్ పేలి వ్యక్తి మృతి

August 15, 2020

Man no more when compressor explodes in puncture shop

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఇన్నిరోజులూ పనీపాటలు లేక బడుగు బలహీన వర్గాల ప్రజలు చితికిపోయారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఇప్పుడిప్పుడే ప్రజలు తమ రెక్కలు విదిల్చి పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో ఘోరం జరిగింది. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో ఓ పంక్చర్ షాపు కార్మికుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. షాపులో కంప్రెషర్ పేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.  

57 ఏళ్ల శంకరప్ప అనే వ్యక్తి శనివారం ఉదయం పంక్చర్ షాపుకు వెళ్లాడు. షాపు తాళం షాపు తెరిచాడు. అందులో ఉన్న కంప్రెషర్ స్విచ్ ఆన్ చేసి షాపు శుభ్రం చేస్తున్నాడు. ఇంతలో కంప్రెషర్‌లో ప్రెజర్ ఎక్కువై ఒక్కసారిగా భారీ శబ్దంతో కంప్రెషర్ పేలింది. దీంతో శంకరప్ప కాళ్లకు శరీర భాగాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యలు ఆయనను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. శంకరప్ప మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.