నా కష్టం ఎవరికీ రాకూడదు బాబోయ్.. - MicTv.in - Telugu News
mictv telugu

నా కష్టం ఎవరికీ రాకూడదు బాబోయ్..

November 22, 2017

చొక్కా గుండీ పెట్టుకోవడం మరచిపోయారనో, లేకపోకే జిప్పు సరిగ్గా వేసుకోలేదనో ఎవరైనా చెబితేనే మనం సిగ్గుతో సగం చచ్చి చాపలా ముడుచుకుపోతాం.. మరి అదే మనం వొంటిపై నూలు పోగు కూడా లేకండా జనం మధ్య తిరగాల్సి వస్తే.. నిజంగానే చచ్చిపోతామో కదా.. ఇలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఒక హోటల్లో బస చేసిన మనిషి.. భోజనం చేసి ఖాళీ ప్లేను బయటికి తీసుకొచ్చి పెట్టాడు. అయితే పొరపాటునో, ఏమరుపాటునో, లేకపోతే మందు మైకంలోనో.. నగ్నంగానే బయటికొచ్చాడు. మళ్లీ గదిలోపలికి వెళ్లబోగా.. డోర్ లాక్ అయింది. ఎంత తోసినా తెరుచుకోలేదు.  ఆసామి ఒంటిపైన ఒక్క బట్టముక్కా లేదు. ఇంకేముంది సిగ్గుతో చితికిపోయినా నానా అవస్థా పడ్డాడు. చేతులతో, ప్లేట్లను అడ్డుపెట్టుకున్నాడు. హోటల్లో బస చేసిన వారు అతణ్ని చూసి దడుసుకుని వెళ్లిపోతున్నారు. అతడు లిఫ్టులోకి అడుగు పెట్టేసరికి అక్కడున్న ఓ మహిళ అయ్యబాబోయ్ అని కళ్లు మూసుకుని, తన బిడ్డ కళ్లను కూడా మూసేసింది.  అతడు ప్లేట్లను అడ్డుపెట్టుకుని ఎట్టకేలకు రిసెప్షన్ దగ్గరికెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. వీడియో చూడండి.. ఆయనగారి తిప్పలు.. ఎక్కడ  ఈ ఘటన జరిగిందో తెలియడం లేదు. వీడియో పాతదే అయినా సోషల్  మీడియా విజృంభించడంతో మళ్లీ వైరల్ అయింది.