man of Madurai put up poster for finding bride in city
mictv telugu

పెళ్లి కోసం బజారుకెక్కాడు… దెబ్బకు వర్కౌట్ అయింది

June 23, 2022

man of Madurai put up poster for finding bride in city

మంచి చదువు , ఉద్యోగం ఉన్నా.. సరైన సంబంధాలు రావడం లేదని ఓ యువకుడు తన పెళ్లి కోసం వినూత్న ప్రయత్నం చేశాడు. తాను పెళ్లికి రెడీగా ఉన్నానని, మంచి సంబంధం ఉంటే చెప్పమని ఊరంతా తెలిసేలా పోస్టర్లు అంటించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. వివరాల్లోకెళితే.. మధురై టౌన్‌లోని విల్లాపురానికి చెందిన సుదర్శన్, చంద్ర దంపతుల రెండవ కుమారుడు జగన్. వయస్సు 27. బిఎస్సి పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు.

ఇంట్లో పెద్దలు పెళ్లి జరిపించాలని నిశ్చయించి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అయితే వాళ్లేవరికీ జగన్ నచ్చలేదు. తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్లు అవుతున్నా.. తనకి మాత్రం కొన్ని కారణాల వల్ల ఏ సంబంధం కుదరకపోవడంతో ఇక లాభం లేదనుకున్నాడు. వెంటనే తన మెదడులో ఉన్న ఆలోచనను అమల్లో పెట్టాడు. ‘‘ఊరందరికీ నేను పెళ్ళికి సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గర మంచి సంబంధం ఉంటే, అమ్మాయి ఉంటే చెప్పండి.’’ అని మధురై టౌన్ మొత్తం పోస్టర్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పోస్టర్లలో తనకి సంబంధించిన అన్ని వివరాలు ప్రకటించి, ఎవరైనా సంప్రదించాలనుకుంటే ఫోన్ చేయండి అని మొబైల్ నెంబర్ కూడా పెట్టాడు.

టౌన్‌లో ఏ ఒక్క చోటు కూడా వదలకుండా మీనాక్షి టెంపుల్ దగ్గర నుంచి హైకోర్టు వరకు అన్ని చోట్లా పోస్టర్లు వేయడంతో చాలా మంది జగన్‌ని సంప్రదించడం మొదటు పెట్టారు. దీంతో జగన్ ఐడియా ఇప్పుడు మధురై టౌన్‌లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో కూడా జగన్ ఐడియాకి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. త్వరలోనే జగన్ కి పెళ్లి కావాలని సోషల్ మీడియాలో విషెస్ చేబుతున్నారు.