Man on morning walk comes across tiger, dies of heart attack
mictv telugu

రోడ్డెక్కిన పెద్దపులి

November 11, 2022

అది అటవీ ప్రాంతం.చుట్టూ పచ్చని చెట్లు. రోడ్డు ఖాళీగా ఉంది. మార్నింగ్ వాకర్స్ అలా రోడ్డుపై వెళ్తున్నారు. ఇంతలో పెద్దపులి రోడ్డెక్కింది. అంతే దాన్ని చూసిన ఓ వ్యక్తికి గుండె ఆగింది. ఆసుపత్రికి తీసుకోయేలోపే దారుణం జరిగింది. అసలేం జరిగిందటే…

మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన ప్రవీణ్ మార్తే గురువారం ఉదయం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లాడు. అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన కారును పార్క్ చేశాడు. అక్కడ రోడ్డుపై నడుస్తుండగా ఒక్కసారిగా పులి రోడ్డెక్కింది. దాన్ని చూసిన ప్రవీణ్ భయంతో వణికిపోయాడు.పులి దాడి చేస్తుందేమోనని కంగారు పడ్డాడు. పరుగు తీయబోయి కుప్పకూలాడు. ఇది చూసిన మార్నింగ్ వాకర్స్ ప్రవీణ్ దగ్గరకు వచ్చారు. ప్రవీణ్‌కు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో అంబులెన్స్ కు ఫోన్ చేసి రప్పించారు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రవీణ్ ప్రాణాలు విడిచాడు.

ఆలస్యం కాకుంటే…

కాల్ చేసిన గంట తర్వాత అంబులెన్స్ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అంబులెన్స్ త్వరగా వచ్చి ఉంటే ప్రవీణ్ ప్రాణాలు దక్కేవని వారంటున్నారు. గతంలో కూడా కొందరికి ఈ ప్రాంతంలో పులి కనిపించింది. ఇక్కడ పులి తిరుగుతుందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని కొందరు అంటున్నారు.

పులి చిక్కిందోచ్

అటు చంద్రపూర్ అటవీ ప్రాంతంలో తిరుగుతున్న పులిని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. నాలుగు నెలలుగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. గతంలో నలుగురిపై దాడి చేసి చంపేసింది. ఎంతకాలంగా పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం పులిని బంధించారు. చంద్రపూర్‌లో కనిపించిన పులి..ఇప్పడు పట్టుకున్న ఒకటేనా,కాదా అనే క్లారిటీ లేదు.