పార్కుకు వెళ్లి కోటీశ్వరుడయ్యాడు.. ఎంత పెద్ద వజ్రమో.. - MicTv.in - Telugu News
mictv telugu

పార్కుకు వెళ్లి కోటీశ్వరుడయ్యాడు.. ఎంత పెద్ద వజ్రమో..

September 25, 2020

Man picks up shiny 'glass' object, it turns out to be diamond.

అదృష్టం ఉంటే ఏది ముట్టుకున్నా బంగారం అవుతుందంటారు. ఓ వ్యక్తి మెరుస్తున్న రాయిని పట్టుకుంటే అది వజ్రం అని తేలింది. దీంతో ఒక్కసారిగా అతడి జీవితం మారిపోయింది. అతడిని సాధారణ బ్యాంక్ మేనేజర్ స్థాయి నుంచి కోటీశ్వరునిగా మార్చింది. అమెరికాలోని నైరుతి అర్కాన్సాస్‌‌కి చెందిన కెవిన్ కినార్డ్ వృత్తి రీత్యా బ్యాంకు మేనేజ‌ర్‌. అతడికి చిన్న‌ప్ప‌టి నుంచి పార్కులకు వెళ్ల‌డం అల‌వాటు. ఇటీవల క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌కి వెళ్లాడు. 

పార్కులో తిరుగుతుండగా అతడికి త‌ళుక్కుమంటూ ఓ రాయి క‌నిపించింది. చూడ‌టానికి క్రిస్ట‌ల్‌లా మెరుస్తుండ‌టంతో తీసుకుని సంచిలో వేసుకున్నాడు. తరువాత ఆ రాయిని ప‌రీక్షించగా అది అరుదైన వజ్రం అని తెల్సింది. దాని బరువు 9.07 క్యారెట్లు ఉండడంతో ఒక్క‌సారిగా అత‌ని పేరు మారు మ్రోగిపోయింది. అంతేకాకుండా 48 ఏళ్ల క్రితంనాటి అరుదైన వ‌జ్రం సొంతం కావ‌డంతో ఆయ‌న ఆనందానికి అవ‌ధుల్లేవు. మార్కెట్‌లో దాని విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది.