కేసీఆర్ కాన్వాయ్ అడ్డుకున్న యువకుడు.. ఉద్యోగం కోసం..  - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ కాన్వాయ్ అడ్డుకున్న యువకుడు.. ఉద్యోగం కోసం.. 

June 2, 2020

Man Protest In KCR Convoy

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అమరవీరులకు నివాళ్లు అర్పించే సమయంలో నిరసన సెగ తగిలింది. ఓ యువకుడు సీఎం ప్రయాణిస్తున్న కారుకు అడ్డు తగిలి నిరసన వ్యక్తం చేశాడు. తనకు ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పించాలని డిమాండ్ చేశాడు. ఈ పరిణామంతో అక్కడ ఉన్న పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని కాన్వాయ్ కోసం రూట్ క్లియర్ చేశారు. 

గన్‌పార్క్‌ వద్ద నివాళ్లు అర్పించిన తర్వాత సీఎం తన కారులో ప్రగతి భవన్‌కు బయలుదేరారు. కారు కొంత దూరం ముందుకు వెళ్లగానే.. ఓ యువకుడు చేతిలో ప్లకార్డు పట్టుకొని నినాదాలు చేస్తూ ఆయన కారు వైపు దూసుకు వచ్చాడు. కారు డోర్ వద్దకు వెళ్లి తనకు ఉద్యోగం, డబుల్ బెడ్‌ రూం ఇల్లు ఇప్పించాలని కోరాడు.  కాగా ఆ యువకుడు దేవరకొండకు చెందిన హన్మంత్ నాయక్‌గా గుర్తించారు. ఈ పరిణామంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.