ఎస్ఐ ఇచిత్రం.. ఇంజిన్‌ లేని బైక్‌కు చలానా - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్ఐ ఇచిత్రం.. ఇంజిన్‌ లేని బైక్‌కు చలానా

November 14, 2019

కొత్త మోటార్ వెహికిల్ చట్టం వచ్చినప్పటి నుంచి పోలీసులు ఇష్టారీతిగా చలానాలు బాదుతూనే ఉన్నారు. తప్పులేకున్నా జరిమానా కట్టించుకుంటున్నారు. తాజాగా ఇంజిన్ ‌కూడా లేని బైక్‌ను తోసుకు వస్తున్న ఓ యువకుడికి ఓ ఎస్సై వెయ్యి రూపాయల చలానా వేశాడు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే అతడిపై ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. చివరకు వెయ్యి రూపాయలు జరిమానా కట్టించుకోవడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. 

Traffic Challan.

తమిళనాడులోని భువనగిరి తాలుకా సేత్తియాతోపు గ్రామానికి చెందిన శక్తివేల్ ఇటీవల తన పాత బైక్ రిపేర్ చేయించేందుకు మెకానిక్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ మెకానిక్ ఇంజిన్ విప్పేసి రిపేర్ చేయడం ప్రారంభించాడు. ఆలోపు వాగులో దాన్ని శుభ్రం చేసేందుకు శక్తివేల్ తోసుకుంటూ వెళ్లాడు. అతడి రాకను గమనించిన ఎస్సై రత్నవేల్ హెల్మెట్, బైక్ పేపర్లు చూపించాలని కోరాడు. తాను రిపేర్ కోసం వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. వెయ్యి రూపాయల జరిమాన కట్టాలని దురుసుగా ప్రవర్తించాడు. 

ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. డీఎస్పీ జవహర్‌లాల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. వెంటనే వివరణ ఇవ్వాలని కోరాడు. కాగా ఇంజిన్ లేని బైక్‌కు చలానా వేసిన ఎస్సై మరో రెండు నెలల్లో పదవి విరమణ చేయనున్నాడు. ఈ సమయంలో ఇలా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.