Man put his hand in crocodile mouth
mictv telugu

నోట్లో పెట్టాడు, తిప్పి తిప్పి దూల తీర్చింది..వీడియో వైరల్

August 16, 2022

Man put his hand in crocodile mouth

దేశవ్యాప్తంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త కొత్త వీడియోలు హాల్‌చల్ చేస్తున్నాయి. విభిన్నంగా ఉన్న వీడియోలకు, ఫోటోలకు లైక్‌లు, కామెంట్లు అనేవి సహజంగానే వస్తాయి. అప్పుడు వాటిని పోస్ట్ చేసిన వారి ఆనందం మాములుగా ఉండదు. ఈసారి కొత్తగా ప్రయత్నించి, మరో వీడియోను పోస్ట్ చేయడానికి వారు పూనుకుంటారు.

ఈ క్రమంలో ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది యువకులు ఫాలోవర్స్‌ను పెంచుకోవటం కోసం ఎవరు చేయని సాహసాలు చేస్తున్నారు. ఆ సాహసాలలో కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటే, మరికొందరు అదృష్టం కొద్ది బయటపడుతున్నారు. అలా చేయటం రిస్క్ అని వారికి తెలిసినా, అవేమీ పట్టించుకోకుండా వీడియోలను తీస్తున్నారు.

అటువంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో..”నీటి కొలను పక్కన ప్రశాంతంగా ఉన్న మొసలి దగ్గరికి ఓ యువకుడు వెళ్లి, అతని టాలెంట్‌ ఏంటో చూపించాలని అనుకున్నాడు. మరో వ్యక్తి ఆ కుర్రాడు చేస్తున్న విన్యాసాన్ని అతడి ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు. ప్లాన్ ఏంటంటే..మొసలి నోట్లో చెయ్యి పెట్టాలి. అది నోటిని మూసేలోపే చేతిని వెనక్కి తీసుకోవాలి. అలా ఎవరూ చెయ్యని సాహసాన్ని అతడు చెయ్యాలని అనుకున్నాడు.

అనుకున్నట్లుగానే ఆ కుర్రాడు మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టీ పెట్టగానే…మొసలి లటుక్కున నోరు మూసేసింది. దాంతో చెయ్యి లోపల ఉండిపోయింది. దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో అతడికి అర్థం కాలేదు. చెయ్యిని వెనక్కి లాక్కోలేకపోయిన కుర్రాడు..పల్టీకొట్టినట్లు చేశాడు. దాంతో మొసలి కూడా పల్టీ కొట్టింది”. అయితే, ఇలా ఇద్దరూ పల్టికొట్టే స్టంట్ నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ ఆ మొసలి అతని చేతిని వదిలేసిందా? లేక కొరికేసిందా అన్నది తెలియకుండానే వీడియో ముగిసింది.