Man recced area 7 times before intruding into Mamata residence: Police
mictv telugu

సీఎం నివాసం వద్ద ఉగ్రవాది 7 సార్లు రెక్కీ..

July 12, 2022

Man recced area 7 times before intruding into Mamata residence: Police

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇంటి వద్ద ఓ ఉగ్రవాది ఏడుసార్లు రెక్కీ చేసిన ఘటన సంచలనం రేపింది.కోల్‌కతా నగరంలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న సీఎం మమతా ఇంటి గురించి సమాచారం తెలుసుకునేందుకు ఉగ్రవాది హఫీజుల్ మొల్లా ఏడుసార్లు రెక్కీ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. తన సెల్ ఫోన్ తో మమత నివాసాన్ని ఫొటోలు తీశారని పోలీసులు తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల మధ్య రాత్రి హఫీజుల్ మొల్లా అనే ఉగ్రవాది భద్రతా ఏర్పాట్లను దాటి ముఖ్యమంత్రి నివాసంలోకి ఇనుపరాడ్ తో ప్రవేశించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారని చెప్పారు.

మొల్లాను విచారించిన సమయంలో పలు విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. మొల్లా 11 సిమ్ కార్డులను ఉపయోగించాడని… బంగ్లాదేశ్, బీహార్, ఝార్ఖండ్ లకు ఫోన్లు చేశాడని చెప్పారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో అతనికున్న కార్యకలాపాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. మరోవైపు మొల్లా పోలీసు కస్టడీని ఈ నెల 18 వరకు కోర్టు పొడిగించింది. సీఎం నివాసం వద్ద ఉగ్రవాది రెక్కీ నేపథ్యంలో… సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్ ను పదవి నుంచి తొలగించారు.